ట్రైలర్ టాక్ : ఇచ్చిన మాట.. చేసిన పని కనిపించాలి

ట్రైలర్ టాక్ : ఇచ్చిన మాట.. చేసిన పని కనిపించాలి

ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యింది.  ఎన్టీఆర్ రాజకీయ ప్రస్తానం గురించి ట్రైలర్ ను కట్ చేశారు.  ఇందిరాగాంధీ పాత్రను శ్రీకృష్ణుడు గెటప్ లో ఉన్న ఎన్టీఆర్ కు జైశ్రీకృష్ణ అని దణ్ణం పెట్టడంతో ట్రైలర్ ప్రారంభం అయింది.  అక్కడి నుంచి ఎన్టీఆర్ మొదటిసారి ఎన్నికైన తరువాత.. ఇచ్చిన మాట.. చేసిన పని కనబడాలి.. ఆన్ టైమ్ అని చెప్పడంతో ప్రజల కోసం ఏపనైనా వెంటనే చేయాలని చెప్పే ఉద్దేశ్యంలో కట్ చేశారు. 

తరువాత నాదెండ్ల భాస్కర్ రావు క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ.. ఆయన పైలట్ అయితే నేను కో ఫైలట్ అని చెప్పించడం వెనుక.. రాజకీయాల్లో అనుభవం ఉండాలని.. వెనుక నుంచి ఆ విషయాలను చూసుకుంటా అని చెప్పడం.. బసవ తారకంకు చికిత్స కోసం అమెరికా వెళ్లిన తరువాత.. కుట్రలు చేసి ప్రభుత్వాన్ని చేజిక్కించుకోవడం వంటివి ట్రైలర్ లో చూపించారు.  ట్రైలర్ లో పెద్దగా ట్విస్ట్ లు లేకుండా చాలా కూల్ గా వెళ్ళిపోయింది.  మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే.. ఫిబ్రవరి 22 వరకు ఆగాల్సిందే.