అయినను పోయిరావల హస్తినకు సినిమా ప్రారంభం అప్పుడే..?

అయినను పోయిరావల హస్తినకు సినిమా ప్రారంభం అప్పుడే..?

ప్రస్తుతం టాలీవుడ్ హాట్ టాపిక్‌గా ఉన్న చిత్రాల్లో ఎన్‌టీఆర్ నూతన చిత్రం కూడా ఒకటి. ఈ చిత్రం త్రివిక్రమ్, యంగ్ టైగర్ కాంబోలో రెండో సినిమాగా తెరకెక్కనుంది. దీనికి అయినను పోయిరావలే హస్తినకు అనే పేరును దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఎప్పుడు చిత్రీకరణను ప్రారంభించనుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాను మే 20నుండి మొదలు చేయనున్నారట. యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా షూటింగ్‌ను మొదలు చేయనున్నారట. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించనున్నాడు. ఈ చిత్రంలో అతడి పాత్ర పూర్తి రాజకీయ నాయకుడిలా త్రివిక్రమ్ రూపొందించాడట. అంతేకాకుండా ఎన్‌టీఆర్ పాత్ర కూడా రాజకీయాల చుట్టూ తిరగనుంది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది కూడా ఇంకా తేలలేదు. ఇప్పటికి అనేక మంది పేర్లు వినిపించాయి. లక్కీ బ్యూటీ రష్మిక చేస్తుందని కొందరు అనుకున్నారు. అంతేకాకుండా నాచురల్ బ్యూటీ సాయిపల్లవి పేరు కూడా వినిపించింది. మరి ఇందులో హీరోయిన్‌గా ఎవరు చేయనున్నారనేది మాత్రం ఇంకా తేలలేదు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరికీ కొత్త తరహా పాత్రలతో ప్రతి పాత్రని త్రివిక్రమ్ అద్భుతంగా తీర్చి దిద్దాడన కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకట రాలేదు. అతి త్వరలో వస్తుందని అంటున్నారు. మరి ఈ సినిమాతో ఎన్‌టీఆర్, త్రివిక్రమ్ కాంబో మరో హిట్ అందుకుంటుందేమో వేచి చూడాలి.