ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్‌తోనే...

ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్‌తోనే...

ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళితో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు.  వచ్చే ఏడాది జులై 30 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  రామ్ చరణ్ తో కలిసి చేస్తున్న మల్టీస్టారర్ సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.  మరో ఏడాది వరకు ఎన్టీఆర్ మరో సినిమా చేసే ఛాన్స్ లేదు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యాక ఎవరితో సినిమా చేస్తున్నారు అనే దానిపై ఓ క్లారిటీ వచ్చింది.  

నిన్నటి వరకు ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా కొరటాలతో ఉండబోతుందని వార్తలు వినిపించాయి. కొరటాలతో సినిమా మాట వాస్తవమే కానీ, కొరటాలను పక్కన పెట్టి త్రివిక్రమ్ తో చేయాలని ఎన్టీఆర్ అనుకుంటున్నారని తెలుస్తోంది.  ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ తో జరిగిన ఇంటరాక్షన్ లో ఈ విషయం బయటపడింది. అరవింద సమేత మేకింగ్ బాగా నచ్చిందని... నెక్స్ట్ త్రివిక్రమ్ తో చేయాలని అనుకుంటున్నానని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో చెప్పారు.  ఇంకా సంవత్సరం సమయం ఉన్నది కాబట్టి ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాపై సమీకరణాలు మారే అవకాశం ఉండొచ్చు.