త్రివిక్రమ్ కోసం పావులు కదుపుతున్న ఎన్టీఆర్ 

త్రివిక్రమ్ కోసం పావులు కదుపుతున్న ఎన్టీఆర్ 

ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ దాదాపుగా 50శాతం వరకు పూర్తయినట్టు తెలుస్తోంది.  ఈ సినిమా వచ్చే ఏడాది జులై 30 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ ఏ సినిమా చేయబోతున్నారు అనే విషయంపై ఇంకా ఓ క్లారిటీ రాలేదు.  ఏ సినిమా చేయబోతున్నారు అనే దానిపై సోషల్ మీడియాలో వివిధ కథనాలు వస్తున్నా.. ఎన్టీఆర్ మాత్రం తన నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ తోనే చేయాలని అనుకుంటున్నారని తెలుస్తోంది.  

ప్రస్తుతం త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో అలా వైకుంఠపురంలో సినిమా చేస్తున్నారు.  ఏ సినిమా వచ్చే ఏడాది జనవరి 12 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమా రిలీజ్ తరువాత త్రివిక్రమ్ ఏ సినిమా చేస్తున్నారు అన్నది తెలియాలి.  ఎలాగో ఎన్టీఆర్ సినిమా పూర్తయ్యి బయటకు రావడానికి కనీసం మరో నాలుగైదు నెలలు పడుతుంది.  అంటే సమ్మర్ వరకు ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఎన్టీఆర్ బయటకు రావొచ్చు.  సో, సమ్మర్ తరువాత త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ఎన్టీఆర్ ఆసక్తి చూపిస్తున్నారు.  ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ అరవింద సమేత సినిమా చేసిన సంగతి తెలిసిందే.  ఎన్టీఆర్ ను ఆ సినిమాలో అద్భుతంగా చూపించారు.