ఎన్టీఆర్ ప్రచారం మొదలెట్టాడు..!!

ఎన్టీఆర్ ప్రచారం మొదలెట్టాడు..!!

టాలీవుడ్ టాప్ హీరోలు స్పోర్ట్స్ సైతం బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.  ఇండియాలో ఐపీఎల్, ఐఎఫ్ఎల్, హాకీ లీగ్ లా, ఇండియన్ ప్రో కబడ్డీ కూడా బాగా ఫేమస్ అయ్యింది.  ఈ కబడ్డీని స్పోర్ట్స్ ఛానల్స్ తో పాటు స్టార్ మా తెలుగు కూడా ప్రసారం చేస్తున్నది.  ప్రో కబడ్డీ తెలుగు ప్రచార కర్తగా ఎన్టీఆర్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.  దీనికి సంబంధించిన వీడియోను షూట్ చేశారు.  కబడ్డీ ఆట కాదు వేట అంటూ తనదైన పంచ్ డైలాగులతో స్టార్ మా ప్రోకబడ్డీకి ప్రచారం కల్పిస్తున్నారు.  

ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నారు.  రాజమౌళి కొన్ని ముఖ్యమైన పనుల విషయంలో యూఎస్ వెళ్లడంతో సమయం దొరికింది. మరో వారం రోజుల్లో తిరిగి షూటింగ్ ప్రారంభం కాబోతున్నది.