పుట్టినరోజు వేడుకలు చేయవద్దన్న తారక్ !

పుట్టినరోజు వేడుకలు చేయవద్దన్న తారక్ !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20న కావడంతో భారీ ఎత్తున వేడుకల్ని నిర్వహించడానికి ఆయన అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు చేసుకున్నారు.  కానీ ఈసారి ఎలాంటి వేడుకల్ని చేయవద్దని ఎన్టీఆర్ తన అభిమానులకు చెప్పినట్టు తెలుస్తోంది.  ఎందుకంటే గత ఏడాది జూన్ నెలలో ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు.  ఈ ఘటన జరిగి ఏడాది కూడా కాలేదు.  అందుకే తారక్ ఈసారి వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయిచుకున్నారట.  ప్రస్తుతం తారక్ రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.