ఎన్టీఆర్ సొంత ఇంట్లోనే 'ఎన్టీఆర్' సినిమా చిత్రీకరణ !

ఎన్టీఆర్ సొంత ఇంట్లోనే 'ఎన్టీఆర్' సినిమా చిత్రీకరణ !

క్రిష్ డైరెక్షన్లో బాలకృష్ణ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా 'ఎన్టీఆర్' పేరుతో బయోపిక్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడు పాత్రను నటుడు రానా పోషించనున్నాడు.  ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ సినిమా చిత్రీకరణ అబిడ్స్ లో ఉన్న ఎన్టీఆర్ గారి సొంత నివాసంలో జరుగుతోందని అన్నారు. 

ఆ ఇంట్లోకి వెళుతున్నప్పుడు చరిత్రలోకి వెళుతున్నట్టు అనిపించిందని, ఆ ఇంట్లో ఎన్టీఆర్ గారి మేకప్ రూమ్ ఇప్పటికీ భద్రంగానే ఉందని, ఆ ఇంట్లో చిత్రీకరణ జరగడం జీవితంలో మర్చిపోలేని విషయమని అన్నారు.  వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి విద్యా బాలన్ బసవతారకంగారి పాత్రలో నటిస్తున్నారు.