మహేష్ తో చరణ్, బన్నీతో ఎన్టీఆర్... 

మహేష్ తో చరణ్, బన్నీతో ఎన్టీఆర్... 

మహేష్ బాబు హీరోగా చేస్తున్న సరిలేరు నీకెవ్వరూ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జనవరి 5 వ తేదీన ఎల్బీ స్టేడియంలో జరగబోతున్నది.  ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, కొంతమంది రాజకీయ నాయకులు వస్తున్నారు.  ఈ వేడుకను భారీ ఎత్తున నిర్వహిస్తుండటం విశేషం.  గతంలో మహేష్ బాబు భరత్ అనే నేను ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ వచ్చిన సంగతి తెలిసిందే.  

ఇదిలా ఉంటె, మహేష్ సరిలేరు నీకెవ్వరూ ప్రీ రిలీజ్ వేడుక తరువాత బన్నీ అల వైకుంఠపురంలో సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరగబోతున్నది.  ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా ఎన్టీఆర్ రాబోతున్నారట.  ఎన్టీఆర్.. అల్లు అర్జున్ మధ్య మంచి స్నేహం ఉన్నది. అలానే ఎన్టీఆర్.. త్రివిక్రమ్ మధ్య కూడా మంచి స్నేహం ఉంది.  దీంతో ఎన్టీఆర్ ను ఈ వేడుకకు ఆహ్వానించినట్టు తెలుస్తోంది.