అభిమాని మృతిపై ఎన్టీఆర్ సంతాపం

అభిమాని మృతిపై ఎన్టీఆర్ సంతాపం

సినీ హీరోలకు అభిమానులు కోకొల్లలుగా ఉంటారు.  అభిమానుల పట్ల హీరోలు ఎప్పుడు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు.  జూనియర్ ఎన్టీఆర్ కు అభిమానులంటే చెప్పలేనంత అభిమానం.  ప్రతి వేడుకల్లోనూ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్తుంటారు.  కృష్ణా జిల్లాకు చెందిన అభిమాన సంఘం అధ్యక్షుడు జయదేవ్ హఠాత్తుగా మరణించారు.  జరదేవ్ మరణవార్త విన్న ఎన్టీఆర్, వెంటనే స్పందించాడు.  జయదేవ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.  

"నాకు అత్యంత ఆప్తుడు, కృష్ణా జిల్లా అభిమాన సంఘం ప్ర‌తినిధి జ‌య‌దేవ్ ఇక లేర‌న్న వార్త న‌న్ను తీవ్ర మ‌న‌స్థాపానికి గురి చేసింది. నిన్ను చూడాల‌నితో మొద‌లైన మా ప్ర‌యాణం ఇలా అర్థంత‌రంగా ముగిసిపోతుంద‌ని ఊహించ‌లేదు. న‌టుడిగా నేను చూసిన ఎత్తుప‌ల్లాల్లో నాకు వెన్నంటే ఉన్న‌ది నా అభిమానులు. ఆ అభిమానుల‌లో నేను వేసిన తొలి అడుగు నుంచి నేటి వ‌ర‌కు నాకు తోడుగా ఉన్న‌వారిలో జ‌య‌దేవ్ చాలా ముఖ్య‌మైన‌వారు. జ‌య‌దేవ్ లేని లోటు నాకు తీర‌నిది. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటూ ఆయ‌న కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నాన‌ని " జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు.