ఎన్టీఆర్ చేస్తేనే దానికి అందమా..!!?

ఎన్టీఆర్ చేస్తేనే దానికి అందమా..!!?

రామాయణం మహాకావ్యాన్ని ఎందరో సినిమాలుగా తీశారు.  ప్రతి ఒక్కరు ఒక్కో రకంగా సినిమాగా మలిచారు.  ఇప్పుడు అల్లు అరవింద్ అండ్ కో నిర్మాతలుగా దంగల్, మామ్ సినిమాల దర్శకులు దర్శకులుగా రామాయణ కావ్యాన్ని సినిమాగా తీసేందుకు సిద్ధం అయ్యారు.  దాదాపు రూ. 1500 కోట్ల ఖర్చుతో సినిమా చేయబోతున్నారు.  3డిలో తెరకెక్కబోతున్న ఈ మూవీలో రాముడి పాత్ర మొదట రామ్ చరణ్ వద్దకు వెళ్లిందట.  

రామ్ చరణ్ దానిపై పెద్దగా మక్కువ చూపించలేదు.  ఇప్పుడు అందరు రాముడి పాత్రలో ఎన్టీఆర్ అయితేనే బాగుంటుందని అంటున్నారు.  ఎన్టీఆర్ చేస్తే రాముడి పాత్రకు అందం వస్తుందని, గతంలో ఎన్టీఆర్ కొన్ని పౌరాణిక సినిమాలు చేశాడు.  బాల రామాయణంలో రాముడిగా నటించాడు. యమదొంగలో యంగ్ యమగా కనిపించి మెప్పించాడు.  

ఈ రామాయణంలో రాముడిగా ఎన్టీఆర్ ను తీసుకుంటే బాగుంటుందని నెటిజన్లు అంటున్నారట. ఎన్టీఆర్ రాముడిగానే కాకుండా.. రావణుడిగా కూడా మెప్పించగలడని.. రామాయణంలో ఈ రెండు పాత్రల్లో ఏదో ఒక పాత్రలో ఎన్టీఆర్ చేస్తే బాగుంటుందని అంటున్నారు నెటిజన్లు. మరి దర్శక నిర్మాతల మనసులో ఏముందో చూడాలి.