ఎన్టీఆర్ తో అది కొత్త ప్రయోగమే..!

ఎన్టీఆర్ తో అది కొత్త ప్రయోగమే..!

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా అరవింద సమేత వీర రాఘవ.  వీరిద్దరి కాంబినేషన్లో ఎప్పటి నుంచో సినిమా అనుకుంటున్నా.. ఇప్పటికి సెట్ అయింది.  అజ్ఞాతవాసి తరువాత ఎన్టీఆర్ తో చేస్తున్న ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు దర్శకుడు త్రివిక్రమ్. త్రివిక్రమ్ కు అజ్ఞాతవాసి ఓ చేదు అనుభవాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే.  

ఇక ఎన్టీఆర్ తో చేస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేగంగా జరుగుతున్నది.  ప్రధాన తారాగణానికి సంబంధించిన సీన్స్ చిత్రీకరణ జరుగుతోంది.  రాయలసీమ నేపథ్యంలో ఈ కథ ఉండబోతున్నది.  ఎన్టీఆర్ భాష రాయలసీమ యాసలో ఉంటుందట.  రాయలసీమ నేపథ్యంలో ఎన్టీఆర్ గతంలో చిత్రాలు చేసినప్పటికీ ఆ యాసలో మాట్లాడటం ఎన్టీఆర్ కు కొత్తే.  త్రివిక్రమ్ కు ఆ యాసలో డైలాగులు రాయడం కూడా కొత్తే.  ప్రాసతో, పంచ్ డైలాగులతో అదరగొట్టే త్రివిక్రమ్ రాయలసీమ యాసలో ఎలాంటి ప్రయోగాలు చేస్తాడో చూడాలి.  ఎన్టీఆర్ తో చేస్తున్న ఈ కొత్త ప్రయోగం విజయవంతం అవుతుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.