త్రివిక్రమ్ 'అ' సెంటిమెంట్.. ఎన్టీఆర్ కు కలిసి వస్తుందా..?

త్రివిక్రమ్ 'అ' సెంటిమెంట్.. ఎన్టీఆర్ కు కలిసి వస్తుందా..?

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా టైటిల్స్ కొంచెం విచిత్రంగా ఉంటాయి. ఆయన సినిమాల్లో డైలాగుల్లాగే టైటిల్స్ కూడా కితకితలు పెడుతుంటాయి.  అతడు నుంచి అజ్ఞాతవాసి వరకు సినిమా టైటిల్స్ చూసుకుంటే ఎక్కువ అ అనే అక్షరంతోనే సినిమాలు వచ్చాయి.  అజ్ఞాతవాసి ప్లాప్ అయినప్పటికీ అంతకు ముందు అతడు, అత్తారింటికి దారేది, అ ఆ సినిమాలు హిట్ అయ్యాయి.  ఎన్టీఆర్ సినిమాకు కూడా ఇదే సెంటిమెంట్ ను కొనసాగించబోతున్నాడని తెలుస్తోంది. 

షాడో తరహా కథతో రూపొందుతున్న ఈ సినిమాకు 'అసామాన్యుడు' అనే టైటిల్ అనుకుంటున్నట్టు సమాచారం.  సినిమా కథకు ఈ టైటిల్ అయితేనే సరిగ్గా సరిపోతుందని సమాచారం.  టైటిల్ కు తగ్గట్టుగా కనుక సినిమా ఉంటె ఎన్టీఆర్ కెరీర్లో మరో హిట్ అందుకున్నట్టే అవుతుంది.  మరి త్రివిక్రమ్ సెంటిమెంట్ ఎంతవరకు సెట్ అవుతుందో చూడాలి.