తిరుపతిలో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ప్రారంభం

తిరుపతిలో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ప్రారంభం

సామాజిక సేవా కార్యక్రమాలకు పేరొందిన ఎన్టీఆర్ ట్రస్టు తరపున బ్లడ్ బ్యాంక్ శనివారం తిరుపతిలో ప్రారంభమైంది. కోటకొమ్మల వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ బ్లడ్ బ్యాంక్ ను ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరీ ఈరోజు సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. తిరుపతిలో అత్యాధునిక బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు కావడం ఆనందదాయకమని అన్నారు. నిరంతరం నేను రాజకీయాల్లో ఉండటంతో 1994 నుంచి భువనేశ్వరీ పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. 1997లో ప్రారంభమైన ఎన్టీఆర్ ట్రస్ట్ కు భువనేశ్వరీ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తోందని తెలిపారు. తిరుపతి హెల్త్ హబ్ గా మారుతోందని స్పష్టం చేశారు. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

సంపాదనలో సమాజ సేవకు కొంత ఖర్చు చేయండి. తిరుపతి నుంచే నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఎప్పుడూ నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఎప్పుడూ విడవలేదు. జాతీయ, రాష్ట్ర స్ధాయిలో ఎన్నో సార్లు పోరాటం చేశాం. విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగింది. తిరుపతిలో జరిగిన సభలో మోడీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మోసం చేశారు. ఏడాదిగా రాజీలేని పోరాటం చేశాను. ప్రజాసామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. వ్యక్తిగతంగా ఎప్పుడూ ఆర్ బీఐ, ఈసీ, సీబీఐ విభేదాలు లేదు. రాజకీయంగా దుర్వినియోగం చేయాలని చూడటంతో ఈసీపై పోరాటానికి సిద్ధమయ్యాను. వీవీప్యాట్ లను యాబై శాతం లెక్కించాలి. లెక్కించడం కష్టమని చెప్పడం ఏంటి. ఈవీఎం లో చాలా చోట్ల పనిచేయలేదు. గొడవలు సృష్టించి ఓటర్లును భయందోళనకు గురి చేశారు. నామాటకు విలువ ఇచ్చి అర్ధరాత్రి వరకు వేచి ఉండి ఓట్లు వేశారు. 

ఎన్నికల ముగిసిన వెంటనే గెలిచినట్లు వైసీపీ నేతలు కలలు కంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఏకంగా జగన్ సీఎం బోర్డ్ నే తయారు చేసుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో  అడ్రస్ లేకుండా పోయారని అన్నారు. తమిళనాడులో డిఎంకే పార్టీకి చెందిన నేతలపై ఐటీ దాడులు నిర్వహించారని అన్నారు. బీజేపీ నాయకుల మీద ఎందుకు ఐటీ దాడులు జరగవని ప్రశ్నించారు. నరేంద్ర మోడీ కోసం కాకుండా దేశం కోసం పనిచేయాలని ఐటీ శాఖపై మండిపడ్డారు. వ్యక్తిగత ఇమేజ్ కోసం కుల ప్రాతిపదికగా పనిచేయవద్దని అన్నారు. నా రాజకీయ జీవితంలో ఎన్నడులేని విధంగా సైలెంట్ ఓటింగ్ చూశానని తెలిపారు. అధికార యంత్రానికి ఎంతో గౌరవం ఇచ్చాం.. ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. వైసీపీ నేతలు రౌడియిజం చేసిన ప్రజల భయపడలేదని చంద్రబాబు పేర్కొన్నారు.