అరవింద సమేత షూటింగ్ ఎక్కడంటే..

అరవింద సమేత షూటింగ్ ఎక్కడంటే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న చిత్రం 'అరవింద సమేత'. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మొదటి షెడ్యూల్లోనే రెండు భారీ యాక్షన్ సీన్స్ ను తెరకెక్కించారు. రాయలసీమ నేపథ్యంలో సాగున్న చిత్రం కావడంతో ఊర మాస్ స్టయిల్లోనే త్రివిక్రమ్ ఆ రెండు ఫైట్స్ ను డిజైన్ చేశాడట. మొన్ననే ఎన్టీఆర్ రఫ్ లుక్ లో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. 

తాజాగా ఈ అరవింద సమేత సినిమా షూటింగ్ అప్ డేట్స్ చూస్తే ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లోని కొంపల్లి ప్రాంతంలో జరుగుతోందని సమాచారం. ఇక్కడే నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాల చిత్ర్రీకరణ జరుగుతోంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నాడు. ఇది వరకు త్రివిక్రమ్ తీసిన చిత్రాలకు భిన్నంగా ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉండనుంది. ఎన్టీఆర్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధా కృష్ణ నిర్మించనున్నారు.