స్విస్ ఇటాలియన్ బోర్డర్ లో ఎన్టీఆర్..!!

స్విస్ ఇటాలియన్ బోర్డర్ లో ఎన్టీఆర్..!!

ఎన్టీఆర్ అరవింద సమేత షూటింగ్ స్పీడ్ గా జరుగుతున్నది.  ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్నది.  సాంగ్స్ షూట్ మాత్రమే పెండింగ్ ఉన్నది.  ఇందులో భాగంగా  ఓ సాంగ్ చిత్రీకరణ కోసం యూనిట్ స్విస్ వెళ్ళింది.  స్విస్ ఇటాలియన్ బోర్డర్ లో సాంగ్ ను షూట్ చేస్తున్నారు.  

అక్కడ సాంగ్స్ షూట్ జరుగుతుండగా.. ఇక్కడ పోస్ట్ ప్రొడక్షన్స్ కు సంబంధించిన వర్క్స్ ను చేస్తున్నారు.  ఇప్పటికే ఈ సినిమాలోని నాలుగు సాంగ్స్ ను రిలీజ్ చేశారు.  నాలుగు పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.  ముఖ్యంగా పాటల్లో రాయలసీమ యాస కనిపించడంతో పాటలు కొత్తగా ఉన్నాయి.  అక్టోబర్ 11 న సినిమా రిలీజ్ కాబోతున్నది.  

ఎన్టీఆర్, పూజా హెగ్డే, ఈషా రెబ్బ, సునీల్, జగపతిబాబు, నాగబాబు తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.  త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్నది.