క్లాస్ టచ్ ఇచ్చిన ఎన్టీఆర్ 

క్లాస్ టచ్ ఇచ్చిన ఎన్టీఆర్ 

ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ యంగ్ టైగర్ 35వ వసంతంలోకి అడుగుపెడుతున్న తరుణంలో చిత్రబృందం నిన్ననే ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇవాళ మోషన్ పోస్టర్ రూపంలో ఓ క్లాస్సి లుక్ ను అభిమానులకు అందించారు. ఎన్టీఆర్ ఉబర్ కూల్ లుక్ లో ఉండగా..పూజ హెగ్డే ఓ వైపు కూర్చుని ఇద్దరు మాట్లాడుకునే సన్నివేశం నుండి పోస్టర్ ను చిత్ర బృందం రూపొందించింది. 

ఎస్ థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ఆహ్లాదకరంగా ఉంది. త్రివిక్రమ్ శైలిలోనే టైటిల్స్ అని అచ్చ తెలుగులోనే ఉన్నాయి. నిన్న రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ రఫ్ లుక్ తో పర్ఫెక్ట్ మాస్ మసాలలా ఉండగా, ఇప్పుడొచ్చిన పోస్టర్ మాత్రం కూల్ గా క్లాస్ గా ఉంది. చూస్తుంటే త్రివిక్రమ్..ఎన్టీఆర్ అభిమానులకు మాస్, క్లాస్ ను కలిపి వడ్డిస్తాడని అర్థమవుతోంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ లో బిజీగా ఉన్న ఈ చిత్రం అక్టోబర్ నాటికి రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేశారు. ఎస్ రాధా కృష్ణ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.