కొత్త రికార్డుల్ని సృష్టిస్తున్న ఎన్టీఆర్ !

కొత్త రికార్డుల్ని సృష్టిస్తున్న ఎన్టీఆర్ !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'అరవింద సమేత' టీజర్ ఆగష్టు 15నాడు స్వాతంత్ర్యదినోత్సవ కానుకగా విడుదలైంది.  విడుదలైన కొద్దిసేపటి నుంచే ఆల్ ఇండియా స్థాయిలో ట్రెండింగ్ అవడం మొదలుపెట్టిన ఈ టీజర్ పూర్తిగా మూడు రోజులు కూడ గడవక ముందే 9 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. 

ఎన్టీఆర్ కెరీర్లో ఇదొక కొత్త రికార్డ్ అనుకోవచ్చు.  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తుండటం వలన సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  హారిక, హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ  సినిమాలో పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తుండగా, నాగబాబు ఎన్టీఆర్ కు తండ్రిగా కనిపించనున్నారు.