సెప్టెంబర్ 12, శనివారం దినఫలాలు

సెప్టెంబర్ 12, శనివారం దినఫలాలు

మేషం: కొత్తగా రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.
కుజ - హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.

వృషభం: కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు అనూహ్య ఫలితాలు. సంఘంలో గౌరవం. వస్తు,వస్త్రలాభాలు. కొన్ని వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
గురు - పసుపు రంగు వస్త్రాలు దానం చేయండి.

మిథునం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం. 
శని - శ్రీ వేంకటేశ్వర స్వామికి పెరుగన్నం నివేదన చేయండి.

కర్కాటకం: ఆస్తి తగాదాలు పరిష్కారం. శుభవార్తా శ్రవణం. విందువినోదాలు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. 
శని - నవధాన్యాల జలం తో శివాభిషేకం చేయండి.

సింహం: రుణదాతల ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం. కుటుంబసభ్యులతో చర్చలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు. 
గురు - చదువు చెప్పిన గురువులకు కానుకలు సమర్పణ చేయండి.  

కన్య: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తిలాభ సూచనలు. బంధువులతో సఖ్యత. విందువినోదాలు. చిన్ననాటి విషయాలు తెలుసుకుంటారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి. 
కుజ - మందారం పుష్పాలతో సుబ్రమన్య స్వామిని ఆరాధించండి.

తుల: శ్రమకు ఫలితం కనిపించదు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.  
శుక్ర - మహాలక్ష్మి అమ్మవారిని తెల్లని పుష్పాలు సమర్పణ చేయండి. 

వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. భూవివాదాల పరిష్కారం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. 
బుధ - విష్ణు పంజరీ సోత్రం పారాయణ చేయండి. 

ధనుస్సు: కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. బంధువిరోధాలు. సోదరులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. 
చంద్ర - పేదలకు బియ్యం దానం చేయండి.  

మకరం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనసౌఖ్యం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
రవి - పేదలకు గోధుమ రొట్టెలు దానం చేయండి. 

కుంభం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా కొనసాగుతారు.
బుధ - విష్ణు సహస్రనామాలు చెప్పండి. 
 
మీనం: వ్యవహారాలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు ఎదురవుతాయి. 
శుక్ర - మహాలక్ష్మి అమ్మవారికి  పటిక బెల్లం నివేదన చేయండి.