జులై 13, 2020 సోమవారం దినఫలాలు

జులై 13, 2020 సోమవారం దినఫలాలు

 మేష రాశి:
ఆస్తి విషయాలు చర్చకు వస్తాయి.పెద్దల నుండి సంక్రమించిన అనారోగ్యం కూడా బాధించగలదు. మంచి సమయం కోసం వేచి యుండి భవిష్యత్తు ప్రణాళికలను పరిశీలించండి. వ్యాపారం లాభించగలదు.  అప్పు చేయటం అంత మంచిది కాదు.అధ్యయనానికి మంచి సమయం.
పరిహారం: శ్రీసూక్తం, విష్ణు సహస్రనామం చదవండి.
 వృషభ రాశి:
ఉపాసన మార్గం మీకు చేరువలోనున్నప్పటికీ మీరు ఏ కారణం చేతనో చేపట్టటం లేదు. కార్యాలయంలో కొన్ని విభేదాలుండవచ్చు.ఆశించిన డబ్బు కొంత ఆలస్యంగా అందగలదు. మీ సలహా పాటించి ఇతరులు లాభం పొందగలరు.
పరిహారం:  లక్ష్మీ గణపతిని పూజించండి.
 మిథున రాశి:  
వింత ఆలోచనలు కలుగవచ్చు. ఇంటిలోని ఒకరి ఆరోగ్య పరిస్థితి అర్థం కాకపోవచ్చు. ఖర్చులు అధికం కావచ్చు. పెట్టుబడులు కలసిరాగలవు. విద్యార్థులకు మంచి అవకాశాలున్నాయి.
పరిహారం: సుబ్రహ్మణ్య కవచం చదవండి.
 కర్కాటక రాశి:
అనుకున్న కార్యాలు నెరవేరగలవు. కొంత సమయం వృధా కాగలదు. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించాలి. ఆధ్యాత్మిక దైవ చిన్తనలలో పాల్గొంటారు.
పరిహారం: గౌరీ శంకరుల పూజ
సింహ రాశి:
సంఘంలో గౌరవం పెరుగుతుంది. కొత్త పనిని చేపడతారు. జీవిత భాగస్వామి మీ నుండి ఏదో ఆశించటం జరుగుతుంది. ఒక ఉత్తరం లేదా E-  మెయిల్  అందుకుంటారు.
పరిహారం:  సూర్య ఆరాధన చేయండి.
కన్య రాశి:
బాధ్యతలు పెరుగుతాయి. ఒక్కొక్క పనిని నిదానంగా చేసుకోవటమే మంచిది. బంధువుల రాక ఉన్నది. మీ సహనం మీకు మంచి చేయగలదు.
పరిహారం: శ్రీసూక్తం చదవండి.
 తుల రాశి:
ఈ వారం ఒక చక్కని యోగం సంభవించనున్నది. సమస్యలు కనుక వుంటే అశ్రద్ధ చేయవద్దు.  పరిష్కారం కోసం ప్రయత్నించండి.  కొన్ని లావాదేవీలు జరుపుతారు. రావలసిన బాకీలు ఇంకా ఆలస్యం కావొచ్చు.
పరిహారం: విష్ణు సహస్రనామం చదవండి.
 వృశ్చిక రాశి:
ఇంటి పనులు ముమ్మరం చేయగలరు. స్త్రీలతో వ్యవహరించునప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. స్థాన చలనం ఉండగలదు. మీ శ్రమకు తగు గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులు  రాగలవు.
పరిహారం:  సుందరాకాండ పారాయణం
 ధను రాశి:
ఈ సమయాల్లో మంచి వార్త వింటారు. నూతన ఉత్సాహంతో పని చేస్తారు. విద్యార్థులకు పురోగతి బాగుంటుంది . ప్రయోజనాల విషయం లో జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రమకు తగిన ప్రతిఫలాలు ఉంటాయి.
పరిహారం: దుర్గా సప్తశ్లోకీ చదవండి.
 మకర రాశి:
మిత్రులతో విభేదాలు ఉండగలవు. భావోద్రేకంతో స్పందించటం కంటే సమయస్ఫూర్తితో స్పందించటం వలన లాభం పొందగలరు. దాచిపెట్టిన వ్యవహారం బయట పడటం వలన కొంత ఇబ్బంది ఉండవచ్చు.ఆదాయం బాగుంటుంది.
పరిహారం:  ఉపాసన కలిగిన గురువులను దర్శనం చేసుకోండి.
కుంభ రాశి:
పరిస్థితులు మారినట్లు అనిపించగలదు. మారలేదని తెలుసుకుంటారు. లోపల అనుకుని బయట చెప్పని విషయాలు కాలం అయిపోయిన తరువాత చెప్పవలసి రావటం అనే పరిస్తితులు ఏర్పడతాయి.
పరిహారం: లింగాష్టకం చదవండి.
 మీన రాశి:
పెట్టుబడులకు మంచి అవకాశాలున్న  సమయం:  దూర ప్రాంతాల్లో కొన్ని  అవకాశం రాగలవు.   మధ్యవర్తిత్వం జరపవలసి ఉంటుంది. వాహనం సమస్య సృష్టిస్తుంది.పై అధికారులు కనిపెడుతున్నారు. జాగ్రత్త వహించండి.