సెప్టెంబర్ 28,సోమవారం దినఫలాలు 

సెప్టెంబర్ 28,సోమవారం దినఫలాలు 

మేషం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. మీ శ్రమకు తగిన ఫలితం దక్కవచ్చు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
వృషభం: కార్యక్రమాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. శారీరక రుగ్మతలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో నిరుత్సాహం. దేవాలయ దర్శనాలు.
మిథునం: అప్పులు చేస్తారు. ప్రయాణాలు వాయిదా. ఆరోగ్య, కుటుంబసమస్యలు. బంధువులతో విరోధాలు. కార్యక్రమాలు మధ్యలోనే విరమిస్తారు. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగులు మరిన్ని బాధ్యతలు చేపడతారు.
కర్కాటకం: నూతన వ్యక్తులతో పరిచయాలు. శుభవర్తమానాలు. ధనలాభం. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. దేవాలయ దర్శనాలు. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఒత్తిడులు.
సింహం: కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్యసమస్యలు. స్నేహితులతో తగాదాలు. శారీరక రుగ్మతలు. వ్యాపారులకు  నిరాశ. ఉద్యోగులకు పనిభారం. కళాకారులకు ఒత్తిడులు.
కన్య: అనుకున్న ఆదాయం సమకూరుతుంది. స్నేహితుల నుంచి శుభవార్తలు. దేవాలయ దర్శనాలు. ఆస్తి వివాదాలు పరిష్కారం. వాహనయోగం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నతస్థితి.
తుల: ఆప్తులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారులకు సమస్యలు. ఉద్యోగులు సమస్యలతో సతమతమవుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అనుకోని ఖర్చులు.
వృశ్చికం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తి లాభ సూచనలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ప్రోత్సాహం.
ధనుస్సు: ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. ఆదాయం పెరుగుతుంది. స్నేహితులు, బంధువులతో సమస్యలు పరిష్కారం. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు గుర్తింపు.
మకరం: ఆదాయానికి మించి ఖర్చులు. కార్యక్రమాలు ముందుకు సాగవు. బంధువులతో విభేదాలు. వ్యయప్రయాసలు. శారీరక రుగ్మతలు. వ్యాపారులు నిరాశ. ఉద్యోగులకు పనిభారం.
కుంభం: బంధువుల నుంచి విమర్శలు. కుటుంబసమస్యలు వేధిస్తాయి. కొన్ని కార్యక్రమాలు వాయిదా.  వ్యాపారులకు ఒడిదుడుకులు. ఉద్యోగులకు మార్పులు. దూరప్రయాణాలు.
మీనం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. అదనపు రాబడి. ఆహ్వానాలు రాగలవు. దూరపు బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. వాహనసౌఖ్యం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు అనుకూలం.