సెప్టెంబర్ 26, శనివారం దినఫలితాలు

సెప్టెంబర్ 26, శనివారం దినఫలితాలు


మేషం: రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో నిరాశ.

వృషభం: ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. బంధువుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో మార్పులు ఉండవచ్చు.

మిథునం: కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆప్తులతో సఖ్యత. విందువినోదాలు. నూతన విద్యావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

కర్కాటకం: ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. విలువైన సమాచారం. విందువినోదాలు. దూరపు బం«ధువులను కలుసుకుంటారు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.

సింహం: శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి

కన్య: రాబడి కంటే ఖర్చులు అధికం. పనుల్లో జాప్యం. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

తుల: ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.

వృశ్చికం: పనుల్లో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. సోదరులతో విభేదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.

ధనుస్సు: పలుకుబడి పెరుగుతుంది. ఆస్తిలాభం. కార్యజయం. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

మకరం: కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యభంగం. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

కుంభం: కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

మీనం: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వాహనాలు కొంటారు. పనుల్లో పురోగతి. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.