సెప్టెంబర్ 3, 2020 గురువారం రాశిఫలాలు

సెప్టెంబర్ 3, 2020 గురువారం రాశిఫలాలు

మేషం : శుభకార్యాలకు హాజరవుతారు. ఆధ్యాత్మిక చింతన. బంధువుల నుంచి ముఖ్య సమాచారం. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
పరిహారం : ఆవునేయి కలిపిన అన్నమును శివునికి నివేదన చేయండి. 

వృషభం : యత్నకార్యసిద్ధి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగాలలో అనుకూలత.
పరిహారం : తీపి అటుకులు లక్ష్మీ నారాయణ స్వామిని నివేదన చేయండి. 

మిథునం : పనుల్లో ప్రతిష్ఠంభన. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొద్దిపాటి చికాకులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
పరిహారం : పచ్చ కర్పూరం, తీపి పదారాలు వేంకటేశ్వర స్వామిని నివేదన చేయండి. 

కర్కాటకం : కుటుంబసమస్యలు ఎదురవుతాయి. ధనవ్యయం. శ్రమ తప్ప ఫలితం ఉండదు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
పరిహారం : అష్ట గంధం తో అమ్మవారికి అలంకర చేయండి. 

సింహం : కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆస్తిలాభం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు అనుకోని హోదాలు.
పరిహారం : సంపెంగ పుష్పాలను దక్షిణామూర్తికి సమర్పణ చేయండి. 

కన్య : ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. బంధువుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
పరిహారం : గోపీ చందనం తో కృష్ణున్ని పూజించండి. 

తుల : మిత్రులతో కలహాలు. కొత్తగా రుణాలు చేస్తారు. అనారోగ్యం. పనులు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా. వృత్తి, వ్యాపారాలలో కొంత గందరగోళం.
పరిహారం : మహాలక్ష్మి అమ్మవారికి గంధం నీటి తో అభషేకం జరిపించండి. 

వృశ్చికం : కుటుంబంలో చికాకులు. ఖర్చులు అధికం. పనుల్లో జాప్యం. మిత్రులతో మాటపట్టింపులు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
పరిహారం : నల్ల కలువ పుష్ప్పలతో శని గ్రహాన్ని పూజించండి. 

ధనుస్సు : వ్యవహారాలు సాఫీగా కొనసాగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
పరిహారం : సరస్వతి అమ్మవారికి పెరుగన్నం నివేదన చేయండి. 

మకరం : కొత్త రుణయత్నాలు. పనుల్లో అవాంతరాలు. బంధువులతో విభేదాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
పరిహారం : ఎండు మిరపకాయలతో దిష్టి తీసుకోండి. 

కుంభం : స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కుటుంబంలో సంతోషంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.
పరిహారం : నవగ్రహాలకు అర్చన నిర్వహించి బెల్లమును నివేదన చేయండి. 

మీనం : ఆదాయానికి మించి ఖర్చులు. అదనపు బాధ్యతలు. స్వల్ప అనారోగ్యం. బంధువులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ.
పరిహారం : కులదేవతకు పెరుగన్నం నివేదన చేయండి.