సెప్టెంబర్ 8, 2020 మంగళవారం రాశిఫలాలు

సెప్టెంబర్ 8, 2020 మంగళవారం రాశిఫలాలు

మేషం : పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. వస్తులాభాలు. మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. దైవచింతన.

వృషభం : సన్నిహితులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఖర్చులు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మిథునం : పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

కర్కాటకం : సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వస్తు, వస్త్రలాభాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

సింహం : పనుల్లో ప్రతిష్ఠంభన. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. బంధువర్గంతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. ఆస్తుల వివాదాలు.

కన్య : రుణాలు చేస్తారు. ఆలయ దర్శనాలు. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. బంధుమిత్రుల నుంచి సమస్యలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

తుల : పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. పనుల్లో విజయం. ఆహ్వానాలు అందుతాయి. శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

వృశ్చికం : పనులు మధ్యలో విరమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు. ధనవ్యయం. సోదరులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

ధనుస్సు : సన్నిహితులతో తగాదాలు. ఆలయ దర్శనాలు. ఆరోగ్యభంగం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాలలో చికాకులు.

మకరం : పనులలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. బంధువుల నుంచి ఒత్తిడులు. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కుంభం : కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మీనం : సన్నిహితులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.