రాశిఫలాలు: 02 మార్చి 2019 శనివారం

రాశిఫలాలు: 02 మార్చి 2019 శనివారం

మేషం 
కొత్తవారితో పరిచయాలకు, స్నేహాలకు అనుకూలమైన రోజు. ఇతరుల ప్రభావానికి, ఒత్తిడికి లోను కాకండి. స్థిరమైన ఆలోచనలతో ఉండండి. ఈ రోజు వ్యాపారంలో, మీరు చేపట్టిన పనుల్లో మంచి విజయాన్ని సాధిస్తారు. 

వృషభం
ఈ రోజు మానసికంగా కొంత ఆందోళనకు గురవుతారు. ఏదో తెలియని భయాన్ని అనుభవిస్తారు. ఊహించని ఖర్చులు ఉంటాయి. కొత్త వారితో పరిచయం లేదా విదేశీయానానికి సంబంధించి ముఖ్య సమాచారం అందుకుంటారు. 

మిథునం
గొడవలు, అవమానికి గురవడం లేదా వివాదాల్లో ఇరుక్కోవడం జరగవచ్చు. ఇతరుల వ్యవహారాల్లో కల్పించుకోకండి. మానసిక స్థైర్యాన్ని కోల్పొకుండా పనులు చేస్తే విజయం వరిస్తుంది. ఈ రోజు ప్రతి పనిలో, రోజువారి జీవితంలో ఏదో ఒక ఇబ్బందిని, అడ్డంకులను ఎదుర్కొంటారు. 

కర్కాటకం
బంధువులతో కలిసి శుభకార్యాలయాల్లో పాల్గొంటారు. మంచి రుచికరమైన ఆహారం స్వీకరిస్తారు. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అనుకూల ఫలితం పొందుతారు. ఈ రోజు మీ మిత్రులను కలుసుకోవడం జరుగుతుంది.

సింహం
వ్యాపార సంబంధ లావాదేవి, ఒప్పందాలు జరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. త్వరగా నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఇతరుల ఒత్తిడికి లొంగి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఉద్యోగ విషయంలో కానీ, ప్రయాణ విషయంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. 

కన్య
ఆర్థిక సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుని అవమానం పాలవకండి. ఈ రోజు మీరు అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవడం లేదా అనుకోని అడ్డంకులు రావడంతో మానసిక చికాకు, కలతకు లోనవుతారు. 

తుల
మీ కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. 

వృశ్చికం
అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవడం జరగవచ్చు. ఉద్యోగ విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువులలో ఒకరి నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు. మీ మనస్సు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. 

ధనుస్సు
మీ మాటతీరు, వ్యవహార శైలికానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. వివాదాల్లో తలదూర్చకండి.. మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంటుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకోని మార్పులు చోటుచేసుకోవచ్చు.

మకరం
ఉద్యోగ విషయంలో సామాన్యదినం. ఆర్థిక విషయాలు పెద్దగా అనుకూలించవు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఈ రోజు మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. 

కుంభం
మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డబ్బుకానీ, విలువైన వస్తువులు పోగొట్టుకోకుండా చూసుకోండి. అలాగే ఇతరులతో వ్యవహరించేప్పుడు కూడా జాగ్రత్త అవసరం.

మీనం
అనుకోని విధంగా డబ్బురావడం కానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సాయం అందడం జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగం, వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి.