రాశిఫలాలు: 02 మే 2019 గురువారం

రాశిఫలాలు: 02 మే 2019 గురువారం

మేషం
విలువైన వస్తువుల విషయంలో, నగల విషయంలో జాగ్రత్త అవసరం. అజాగ్రత్తగా ఉండకండి. ఈ రోజు ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చుల కారణంగా కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశముంటుంది. 

వృషభం
చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ధనలాభం కలుగుతుంది. 

మిథునం
మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి కానీ, అనుకున్న మార్పు కానీ చోటు చేసుకుంటుంది. పెట్టుబడులు పెట్టడానికి అనుకూల దినం. అలాగే పై అధికారులతో మీ సంబంధాలు మెరుగవుతాయి. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అభివృద్ధి కొరకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. 

కర్కాటకం
ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బు ఖర్చయ్యే అవకాశముంటుంది. అలసట, ఒత్తిడి అధికంగా ఉంటాయి. పాత మిత్రులను కానీ, దూర దేశంలో ఉన్న మిత్రులను కానీ కలుసుకుంటారు. 

సింహం
చేపట్టిన పనులు, ప్రయాణాలు వాయిదా పడతాయి. అనవసర ఖర్చు పైన పడుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. ఈ రోజు మానసికంగా కొంత ఆందోళనకు గురవుతారు. పెట్టుబడులకు అనువైన రోజు కాదు.

కన్య
వాహనం కొనుగోలు కానీ, భూసంబంధ వ్యవహారాలు కానీ ఒక కొలిక్కి వస్తాయి. వినోదయాత్ర చేస్తారు. స్నేహితులతో, జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. 

తుల
ఈ రోజు గృహసంబంధ వ్యవహారాల్లో మునిగి తేలుతారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనటం కానీ, వాహనం కొనుగోలు చేయటం కానీ చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అత్యుత్సాహానికి పోకండి.

వృశ్చికం
పెట్టుబడులకు, పోటీలకు అనువైన రోజు కాదు. మానసిక ప్రశాంతత కొరకు పిల్లలతో గడపటం కానీ, వినోదకార్యక్రమాల్లో పాల్గొనటం కానీ చేయటం మంచిది. మీరు ఎంతో ఇష్టంతో చేపట్టిన పని వాయిదా పడటంతో మానసికంగా ఆందోళనకు, అసహనానికి గురవుతారు. 

ధనుస్సు
ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. కడుపు నొప్పి కానీ, ఛాతిలో మంటతో కానీ బాధపడే అవకాశముంటుంది. బయటి భోజనం చేయకండి. అలాగే మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉన్నది.

మకరం
మీ అజాగ్రత్త, అనాలోచిత ప్రవర్తన కారణంగా మీ బంధువులను అసహనానికి గురి చేసిన వారవుతారు. వారి నమ్మకాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడండి. తొందరపడి నిర్ణయం తీసుకోకండి. అలాగే ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

కుంభం
మానసికంగా దృఢంగా ఉండటం మంచిది. దానివలన మీ ప్రతిష్టకు భంగం కలగకుండా ఉంటుంది. ఇతరులతో మాట్లాడేప్పుడు కొంత జాగ్రత్త అవసరం. మీ మాటతీరు కారణంగా అనవసరపు వివాదాలు తలెత్తే అవకాశముంటుంది. అలాగే ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చకండి. 

మీనం
మీ జీవిత భాగస్వామి నుంచి అనుకోని సాయం లభిస్తుంది. మీ మధ్య ఉన్న మనస్పార్థలు తొలగిపోతాయి. మీ ప్రేమ వ్యవహారాల్లో కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్నేహితులతో, పరిచయస్తులతో గడపటానికి అనువైన సమయమిది.