రాశిఫలాలు: 04 మే 2019 శనివారం

రాశిఫలాలు: 04 మే 2019 శనివారం

మేషం
ఇవాళ మీకు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. మంచి ఆహారం తీసుకోవడం, నూతన వస్ర్తాలు కొనుగోలు చేయడం చేస్తారు. కొన్ని విషయాల్లో అత్యుత్సాహానికి పోకుండా ఉండడం మంచిది. మీ జీవిత భాగస్వామి నుంచి అనుకోని సహాయం లభిస్తుంది.

వృషభం
ఇవాళ కొంత బద్ధకంగా ఉంటుంది. చిన్న పనికైనా ఇతరులపై ఆధారపడడం, ఇతరుల సాయం తీసుకోవడం చేస్తుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో అనుకోని సమస్య కారణంగా ఆందోళనకు గురవుతారు. అలాగే మిత్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశముంటుంది. అనవసర ఖర్చులుంటాయి. జాగ్రత్తలు వహించడం మంచిది. 

మిథునం
ఇవాళ ఆర్థిక లావాదేవీలకు, పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు గడిస్తారు. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు అలాగే కొత్త స్నేహాలు, పరిచయాలు ఏర్పడతాయి.

కర్కాటకం
ఇవాళ మీరు కొనాలనుకున్న లేదా పొందాలనుకున్న వస్తువులు మీ చేతికి వస్తాయి. ఉద్యోగ విషయంలో అనుకోని విజయం, ప్రశంసలు పొందే సూచనలున్నాయి. చిన్నచిన్న అడ్డంకులు వచ్చినా నిరుత్సాహ పడకుండా పని చేస్తే విజయం మీదే.

సింహం
ఇవాళ మీరు రోజువారీ కార్యక్రమాల నుంచి విశ్రాంతిని కోరుకుంటారు. ఒకే రకమైన జీవన విధానంలో కొంత మార్పు సాధించాలన్న ఆలోచన కలిగి ఉంటారు. అనుకోని ప్రయాణం కానీ, కొత్త వ్యక్తులను కలుసుకోవడం కానీ జరుగుతుంది. 

కన్య
ఇవాళ మానసికంగా కొంత అశాంతితో ఉంటారు. అనుకోని అవమానం కానీ, భయం కానీ ఎదురవుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనువైన రోజు కాదు. కుటుంబ సభ్యుల అనారోగ్యం కూడా మీ ఆందోళనకు కారణం అవ్వొచ్చు.

తుల
ఇవాళ వివాహ సంబంధ వ్యవహారాలకు, ఒప్పందాలకు అనుకూల దినం. మీ మనసులోని భావాలను మీ జీవితభాగస్వామికి వ్యక్తం చేస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామితో కలిసి వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

వృశ్చికం
ఇవాళ ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన పాత బకాయిలు రావడం కాని, లోన్ రావడం కానీ జరుగుతుంది. ఉద్యోగం విషయంలో ఎదురు చూస్తున్న వారికి కొంత అనుకూలత ఏర్పడుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. వ్యాపార విషయాలకు కొంత సామాన్యంగా ఉంటుంది. 

ధనుస్సు
ఇవాళ ప్రేమను లేదా మీ అభిప్రాయాన్ని వ్యక్త పరచడానికి అనుకూలంగా ఉంటుంది. మానసికంగా కొంత ఆందోళన, ఉత్సాహం కలగలుపుగా ఉంటాయి. మీ సంతానం ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. పెట్టుబడులకు, ఆర్థిక లావాదేవీలకు అంతగా అనుకూలమైన రోజు కాదు. 

మకరం
ఇవాళ గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూలమైన రోజు. ఇల్లు కొనడం లేదా నిర్మాణ సంబంధ పనులు, ఒప్పందాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే వాహనం కొనుగోలు చేస్తారు. మిత్రుల, బంధువుల సహాయం అందుకుంటారు. ఇంట్లో విశ్రాంతిగా ఉండడానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు.

కుంభం
ఇవాళ మీ వృత్తికి సంబంధించిన ప్రయాణం కానీ, అనుకోని మార్పు కానీ ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు మంచి సమాచారం అందుకుంటారు. కొత్త బట్టలు కానీ, వస్తువులు కానీ కొనుగోలు చేస్తారు.

మీనం
ఇవాళ ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రావాల్సిన డబ్బులు వచ్చినప్పటికీ, మళ్లీ ఖర్చు రూపంలో వెళ్లిపోతాయి. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ విషయంలో కొంత జాగ్రత్త అవసరం. వాద వివాదాలకు తావివ్వకండి. దాని కారణంగా మీకు కొంత అవమానం కానీ, వ్యతిరేకత కానీ ఏర్పడుతుంది.