రాశిఫలాలు: 06 ఏప్రిల్ 2019 శనివారం

రాశిఫలాలు: 06 ఏప్రిల్ 2019 శనివారం

మేషం
ఈ రోజు అనుకూలమైన దినం. కొన్ని విషయాల్లో అత్యుత్సాహానికి పోకుండా ఉండటం మంచిది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామి నుంచి అనుకోని సహాయం లభిస్తుంది. 

వృషభం
ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో అనుకోని సమస్యకారణంగా ఆందోళనకు గురవుతారు. అలాగే మిత్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశముంటుంది. చిన్న పనికి అయినా ఇతరులపై ఆధారపడటం కానీ, ఇతరుల సాయం తీసుకోవటం కానీ చేస్తారు. 

మిథునం
ఆర్థిక లావాదేవీలకు, పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు గడిస్తారు. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. అలాగే కొత్త స్నేహాలు, పరిచయాలు ఏర్పడుతాయి. 

కర్కాటకం
ఉద్యోగ విషయంలో అనుకోని విజయం కానీ, ప్రశంసలు కానీ పొందుతారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్న అడ్డంకులు వచ్చినా నిరుత్సాహ పడకుండాపనిచేస్తే విజయం సాధిస్తారు.

సింహం
అనుకోని ప్రయాణం కానీ, కొత్త వ్యక్తులను కలుసుకోవడం కానీ జరుగుతుంది. మానసికంగా ఏదో తెలియని అలజడిని, వెలితిని కలిగి ఉంటారు. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ మార్పు కోరుకుంటారు. 

కన్య
ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనువైన రోజుకాదు. కుటుంబ సభ్యుల అనారోగ్యం కూడా మీ ఆందోళనకుకారణం కావచ్చు. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మంచిది. అనుకోని అవమానం కానీ, భయంకానీ ఎదురవుతుంది. 

తుల
మీ మనసులోని భావాలను మీ జీవిత భాగస్వామికి వ్యక్తం చేస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. బంధువులతో లేదా మిత్రులతో ఉన్న గొడవలు సమసిపోతాయి. వివాహ సంబంధ వ్యవహారాలకు, ఒప్పందాలకు అనుకూలదినం. 

వృశ్చికం
ఉద్యోగం విషయంలో ఎదురు చూస్తున్న వారికి కొంత అనుకూలత ఏర్పడుతుంది. రావలసిన పాత బకాయిలు రావడం జరుగుతుంది. వ్యాపార విషయాలకు కొంత సామాన్యంగా ఉంటుంది. కోర్టు కేసులు, వివాదాల్లో విజయం సాధిస్తారు.

ధనుస్సు
మానసికంగా కొంత ఆందోళన, ఉత్సాహం కలగలుపుగా ఉంటాయి. మీసంతానం ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తఅవసరం. పెట్టుబడులకు, ఆర్థిక లావాదేవీలకు అంతగా అనుకూలమైనరోజు కాదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మకరం
మిత్రుల, బంధువుల సహాయం అందుకుంటారు. విద్యా సంబంధ విషయాల్లో మంచి ప్రగతి సాధిస్తారు. గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూలమైన రోజు. ఇల్లు కొనడం లేదా నిర్మాణ సంబంధ పనులు, ఒప్పందాలు ఒక కొలిక్కివస్తాయి. 

కుంభం
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొత్తగా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఈ రోజుఉద్యోగానికి సంబంధించి మంచి సమాచారం అందుకుంటారు. మీ భావోద్యేగాలను, అత్యుత్సాహాన్ని కొంత అదుపులో ఉంచుకోవడం మంచిది.

మీనం
రావలసిన డబ్బులు వచ్చినప్పటికీ, మళ్లీ ఖర్చు రూపంలో వెళ్లిపోతాయి. ఇంటికి సంబంధించిఏదైనా వస్తువు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ విషయంలో కొంత జాగ్రత్త అవసరం. వాదవివాదాలకు తావివ్వకండి. ఒప్పందాల విషయంలో అనుకూలంగా ఉంటుంది.