రాశిఫలాలు: 6  ఫిబ్రవరి 2019 బుధవారం

రాశిఫలాలు: 6  ఫిబ్రవరి 2019 బుధవారం

మేషం
మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి కానీ, అనుకున్న మార్పు కానీ చోటు చేసుకుంటుంది. పెట్టుబడులు పెట్టడానికి అనుకూల దినం. అలాగే పై అధికారులతో మీ సంబంధాలు మెరుగవుతాయి.

వృషభం
ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. ఈ రోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.

మిథునం 
ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బు ఖర్చయ్యే అవకాశముంటుంది. అలసట, ఒత్తిడి అధికంగా ఉంటాయి.

కర్కాటకం
చేపట్టిన పనులు, ప్రయాణాలు వాయిదా పడతాయి. అనవసర ఖర్చు పైన పడుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. పెట్టుబడులకు అనువైన రోజు కాదు. ఈ రోజు మానసికంగా కొంత ఆందోళనకు గురవుతారు. 

సింహం
నూతన వాహనం కొనుగోలు కానీ, భూసంబంధ వ్యవహారాలు కానీ ఒక కొలిక్కి వస్తాయి. వినోదయాత్ర చేస్తారు. స్నేహితులతో, జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. రుచికరమైన ఆహారం, వినోద కార్యక్రమాలతో రోజు గడుపుతారు.

కన్య
ఇంటికి సంబంధించిన వస్తువులు కొనడం కానీ, వాహనం కొనుగోలు చేయడం కానీ చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. అత్యుత్సాహానికి పోకండి. ఈ రోజు గృహసంబంధ వ్యవహారాల్లో మునిగి తేలుతారు. 

తుల
పెట్టుబడులకు, పోటీలకు అనువైన రోజు కాదు. మానసిక ప్రశాంతత కోసం పిల్లలతో గడపటం కానీ, వినోదకార్యక్రమాల్లో పాల్గొనడం కానీ చేయడం మంచిది. సాయం చేస్తా అన్నవారు కూడా సమయానికి మాట మార్చడంతో మానసికంగా ఆందోళనకు, అసహనానికి గురవుతారు. 

వృశ్చికం
ఆరోగ్యం విషయంలో ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. బయటి భోజనం చేయకండి. అలాగే  మీ కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉన్నది.

ధనుస్సు
 మీ అజాగ్రత్త, అనాలోచిత ప్రవర్తన కారణంగా మీ బంధువులను అసహనానికి గురి చేసిన వారవుతారు. వారి నమ్మకాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడండి. తొందరపడి నిర్ణయం తీసుకోకండి 

మకరం
మీ మాటతీరు కారణంగా అనవసరపు వివాదాలు తలెత్తే అవకాశముంటుంది. అలాగే ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చకండి. మానసికంగా దృఢంగా ఉండటం మంచిది. దానివల్ల మీ ప్రతిష్టకు భంగం కలగకుండా ఉంటుంది.

కుంభం
మీ జీవిత భాగస్వామి నుంచి అనుకోని సాయం లభిస్తుంది. మీ మధ్య ఉన్న మనస్పర్థలు తొలిగిపోతాయి. మీ ప్రేమ వ్యవహారాల్లో కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్నేహితులతో, పరిచయస్తులతో గడపటానికి అనువైన సమయమిది.

మీనం
అనుకోని ఖర్చుల కారణంగా కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశముంటుంది. అలాగే విలువైన వస్తువుల విషయంలో, నగల విషయంలో జాగ్రత్త అవసరం. అజాగ్రత్తగా ఉండకండి. ఈ రోజు ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది.