రాశిఫలాలు: 08 ఏప్రిల్ 2019 సోమవారం

రాశిఫలాలు: 08 ఏప్రిల్ 2019 సోమవారం

మేషం
ఇవాళ ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చుల కారణంగా కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశముంటుంది. అలాగే విలువైన వస్తువుల విషయంలో, నగల విషయంలో జాగ్రత్త అవసరం. 

వృషభం
ఇవాళ మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ధన లాభం కలుగుతుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. 

మిథునం
ఇవాళ ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కాని అభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, అనుకున్న మార్పు కానీ చోటు చేసుకుంటుంది. 

కర్కాటకం
ఇవాళ పాత మిత్రులను కానీ, ఇతర దేశాల్లో ఉన్న మిత్రులను కానీ కలుసుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. మీరు అనుకున్న దాని కన్నా ఎక్కువ డబ్బు ఖర్చయ్యే అవకాశముంటుంది. 

సింహం
ఇవాళ మానసికంగా కొంత ఆందోళనకు గురవుతారు. చేపట్టిన పనులు, ప్రయాణాలు వాయిదా పడి పూర్తి కావు. అనవసర ఖర్చు పైన పడుతుంది. గొప్పలకు పోవడం కానీ, ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. 

కన్య
ఇవాళ స్నేహితులతో, జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. రుచికరమైన ఆహారం, వినోద కార్యక్రమాలతో రోజు గడుపుతారు. అలాగే వాహనం కొనుగోలు కానీ, భూసంబంధ వ్యవహారాలు కానీ ఒక కొలిక్కి వస్తాయి.

తుల
ఇవాళ గృహసంబంధ వ్యవహారాల్లో మునిగి తేలుతారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనడం కానీ, వాహనం కొనుగోలు చేయడం కానీ చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉష్ణ సంబంధ అనారోగ్యంతో బాధపడే అవకాశముంటుంది. 

వృశ్చికం
ఇవాళ మీరు ఎంతో ఇష్టంతో చేపట్టిన పని వాయిదా పడడం, అలాగే సాయం చేస్తానన్నవారు కూడా సమయానికి మాట మార్చడంతో మానసికంగా ఆందోళనకు, అసహనానికి గురవుతారు. పెట్టుబడులకు, పోటీలకు అనువైన రోజు కాదు.

ధనుస్సు
ఇవాళ ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. కడుపు నొప్పి కానీ, ఛాతిలో మంటతో కానీ బాధపడే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. బయటి భోజనం చేయకుండా ఉండడం మంచిది. 

మకరం
ఇవాళ మీ అజాగ్రత్త, అనాలోచిత ప్రవర్తన కారణంగా మీ బంధువులను అసహనానికి గురి చేసినవారవుతారు. వారి నమ్మకాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడండి. తొందరపడి నిర్ణయం తీసుకోకండి అలాగే ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. 

కుంభం
ఇవాళ ఇతరులతో మాట్లాడేప్పుడు కొంత జాగ్రత్త అవసరం. మీ మాట తీరు కారణంగా అనవసరపు వివాదాలు తలెత్తే అవకాశముంటుంది. అలాగే ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చకండా ఉండడం మంచిది. 

మీనం
ఇవాళ స్నేహితులతో, పరిచయస్తులతో గడపడానికి అనువైన సమయమిది. అలాగే మీ జీవిత భాగస్వామి నుంచి అనుకోని సాయం లభిస్తుంది. మీ మధ్య ఉన్న మనస్పర్థలు తొలిగిపోతాయి. మీ ప్రేమ వ్యవహారాల్లో కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.