రాశిఫలాలు: 8  ఫిబ్రవరి 2019 శుక్రవారం

రాశిఫలాలు: 8  ఫిబ్రవరి 2019 శుక్రవారం

మేషం
ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ సానుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. మీరు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి.

వృషభం
పెట్టుబడులకు, కొనుగోళ్లకు అనుకూల దినం. అలాగే పై అధికారులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. మీ ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. విద్యలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. 

మిథునం
ఈరోజు జరిపే ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త అవసరం. అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బు ఖర్చయ్యే అవకాశముంటుంది. మీ చిరకాల మిత్రులను కానీ, చాలాకాలంగా కలవని మిత్రులను కానీ కలుసుకుంటారు. 

కర్కాటకం
చేపట్టిన పనులు, ప్రయాణాలు వాయిదా పడటం వల్ల చికాకులు పెరుగుతాయి. అనవసర ఖర్చు పైన పడుతుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చక పోవడం మంచిది. పెట్టుబడులకు కొనుగోళ్లకు అంతగా అనువైన రోజు కాదు.

సింహం
వాహనం కొనుగోలు కానీ, భూసంబంధ వ్యవహారాలు కానీ పూర్తి చేస్తారు. ఈ రోజు మీ స్నేహితులతో, జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం చేస్తారు. 

కన్య
ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అత్యుత్సాహానికి పోయి ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకోకండి.  మీ ఇంటికి సంబంధించిన వస్తువులు కొనడం కానీ, మరమ్మత్తు చేయడం కానీ చేస్తారు. ఈ రోజు గృహ సంబంధ వ్యవహారాల్లో ఎక్కువ సమయం గడుపుతారు.

తుల
ఆర్థిక సంబంధ పెట్టుబడులకు, పోటీలకు అనువైన రోజు కాదు. ఇష్టంతో చేపట్టిన పని వాయిదా పడటం వల్ల మానసికంగా ఆందోళనకు, అసహనానికి గురవుతారు. మానసిక ప్రశాంతంగా ఉండటానికి ఎక్కువ సమయం, వినోద కార్యక్రమాల్లో లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది.

వృశ్చికం
ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. అలాగే మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉన్నది. సమయానుకూల ఆహారం తీసుకోకపోవడం వల్ల కడుపు నొప్పి కానీ, ఛాతిలో మంటతో బాధ పడే అవకాశముంటుంది. 

ధనుస్సు
మీ ప్రవర్తన కారణంగా మీ పై అధికారుల నమ్మకాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడండి. ముఖ్యమైన పనుల విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోకండి. మీ అజాగ్రత్త, అనాలోచిత ప్రవర్తన కారణంగా మీ ఆత్మీయులను అసహనానికి గురి చేసిన వారవుతారు. 

మకరం
మీ మాట తీరు లేదా వ్యవహారశైలి కారణంగా అనవసరపు వివాదాలు తలెత్తే అవకాశముంటుంది. అలాగే ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చకండి. మానసికంగా దృఢంగా ఉండటం మంచిది. ఇతరులతో మాట్లాడేటప్పుడు లేదా కొత్తపనులు చేపట్టినప్పుడు కొంత జాగ్రత్త అవసరం. 

కుంభం
మీ జీవిత భాగస్వామి నుంచి అనుకోని సాయం లభిస్తుంది. మీ ప్రేమ వ్యవహారాల్లో కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. మీ స్నేహితులతో, పరిచయస్తులతో గడపటానికి అనువైన సమయమిది. వారితో మీకున్న అభిప్రాయ భేదాలను తొలగించుకునే ప్రయత్నం చేయండి.

మీనం
అనుకోని ఖర్చుల కారణంగా లేదా మోసపోవటం వల్ల కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశముంటుంది. అలాగే విలువైన వస్తువుల విషయంలో, నగల విషయంలో జాగ్రత్త అవసరం. అపరిచితులను నమ్మకండి. ఈ రోజు ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది.