రాశిఫలాలు: 09 ఏప్రిల్ 2019 మంగళవారం

రాశిఫలాలు: 09 ఏప్రిల్ 2019 మంగళవారం

మేషం
ఇవాళ ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చుల కారణంగా కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశముంటుంది. అలాగే విలువైన వస్తువుల విషయంలో, నగల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. 

వృషభం
ఇవాళ మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ధనలాభం కలుగుతుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. 

మిథునం
ఇవాళ మీరు ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, అనుకున్న మార్పు కానీ చోటు చేసుకునే సూచనలున్నాయి. 

కర్కాటకం
ఇవాళ పాత మిత్రులను కానీ, దూర దేశంలో ఉన్న మిత్రులను కానీ కలుసుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బు ఖర్చయ్యే అవకాశముంటుంది. 

సింహం
ఇవాళ మానసికంగా కొంత ఆందోళనకు గురవుతారు. చేపట్టిన పనులు, ప్రయాణాలు వాయిదా పడతాయి. అనవసర ఖర్చు పైన పడుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

కన్య
ఇవాళ స్నేహితులతో, జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. రుచికరమైన ఆహారం, వినోద కార్యక్రమాలతో గడుపుతారు. అలాగే వాహనం కొనుగోలు కానీ, భూ సంబంధ వ్యవహారాలు కానీ ఒక కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి.

తుల
ఇవాళ గృహ సంబంధ వ్యవహారాల్లో మునిగి తేలుతారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనడం కానీ, వాహనం కొనుగోలు చేయడం కానీ చేస్తారు.

వృశ్చికం
ఇవాళ మీరు ఎంతో ఇష్టంతో చేపట్టిన పని వాయిదా పడటం, అలాగే సాయం చేస్తా అన్నవారు కూడా సమయానికి మాట మార్చడంతో మానసికంగా ఆందోళనకు, అసహనానికి గురవుతారు. 

ధనుస్సు
ఇవాళ ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. కడుపు నొప్పి కానీ, ఛాతిలో మంటతో కానీ బాధపడే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. బయటి భోజనానికి దూరంగా ఉండండి.

మకరం
ఇవాళ మీ అజాగ్రత్త, అనాలోచిత ప్రవర్తన కారణంగా మీ బంధువులను అసహనానికి గురి చేసిన వారవుతారు. వారి నమ్మకాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడితే మంచిది.

కుంభం
ఇవాళ ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. మీ మాట తీరు కారణంగా అనవసరపు వివాదాలు తలెత్తే అవకాశముంటుంది. అలాగే ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చకపోవడం మంచిది. 

మీనం
ఇవాళ  స్నేహితులతో, పరిచయస్తులతో గడపటానికి అనువైన సమయమిది. అలాగే మీ జీవిత భాగస్వామి నుంచి అనుకోని సాయం లభిస్తుంది. మీ మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి.