రాశిఫలాలు: 09 మార్చి 2019 శనివారం

రాశిఫలాలు: 09 మార్చి 2019 శనివారం

మేషం
మీ మిత్రులతో కానీ, దగ్గరి బంధువులతో కానీ వివాదం జరగటం లేదా వారు మిమ్మల్ని అపార్థం చేసుకోవటం జరగవచ్చు. ఏ పని చేయటానికి ముందుకురారు. కుటుంబ సభ్యుల కోపానికి గురవుతారు. శివున్ని పూజించడం మంచిది.

వృషభం
మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో అనుకోని శుభపరిణామాలు ఏర్పడతాయి. ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులు లాభిస్తాయి. వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు.

మిథునం
ఈరోజు అనుకోని బహుమతులు కానీ, ప్రశంసలు కాని పొందుతారు. బంధువుల సహాయం అందుకుంటారు. వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయటానికి అనుకూల సమయం. 

కర్కాటకం
ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయసహకారాలు అందుకుంటారు. ధనలాభం కలుగుతుంది. అలాగే ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువగా చూపుతారు. గురువులను లేదా ఆధ్యాత్మిక వేత్తలను కలుస్తారు. ప్రయాణంలో అడ్డంకుల కారణంగా విసుగుకు లోనవుతారు.

సింహం
ఆర్థిక నష్టం, కోపం, అనారోగ్యం, కలహాలు, ఆందోళన మొదలైన భయం ఈ రోజు సూచించబడ్డాయి. మీ ఆవేశాన్ని, కోపాన్ని అదుపులో ఉంచుకోవటం మంచిది. మానసికంగా ఆందోళనతో ఉంటారు. 

కన్య
మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం చేస్తారు. మీ ప్రేమను, ఆప్యాయతను వ్యక్తం చేయటానికి అనువైన దినం. ఇతరులతో సంబంధ, బాంధవ్యాలు పెంచుకోవటానికి, ఒప్పందాలను, అంగీకారాలను కుదుర్చుకోవటానికి అనుకూల దినం. శివున్ని పూజించండి.

తుల
ఈరోజు ఆర్థిక లాభాలుంటాయి. భూమి సంబంధ వివాదాలు పరిష్కరించుకోవటానికి అనుకూల దినం. జీవిత భాగస్వామి అనారోగ్యం కొంత ఆందోళనకు కారణమవుతుంది. గృహ, వాహన సంబంధ కొనుగోళ్లు చేస్తారు. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి.

వృశ్చికం
మానసికంగా ఉత్సాహం గా ఉన్నప్పటికీ, తెలియని చిన్న ఆందోళన మనసులో ఉంటుంది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం మంచిది. మీ పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారికి సంబంధించిన పనులు పూర్తి చేయగలుగుతారు. 

ధనుస్సు
మానసికంగా కొంత ఆందోళన కానీ, పరాకుగా కానీ ఉండటం జరుగుతుంది. మీ ఇంటికి సంబంధించిన పనులు చేయటానికి, గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. 

మకరం
అత్యుత్సాహానికి పోకుండా మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం మంచిది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

కుంభం
పెట్టుబడులకు, వ్యాపార లావాదేవీలకు అనువైన రోజు కాదు. ఇంటికి ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తారు. బంధువుల కారణంగా డబ్బు ఖర్చయ్యే అవకాశముంటుంది. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. పాతబాకీలు వసూలయినప్పటికీ, అందుకు తగిన ఖర్చుపైన పడటంతో వచ్చిన డబ్బు వచ్చినట్టే పోతుంది. 

మీనం
అనుకున్న పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు ఆర్థికంగా అనుకూలిస్తుంది. అనుకోని వ్యక్తులను కలుసుకుంటారు. మిత్రులు, బంధువులతో కలిసి ఏదైనా శుభకార్యంలో పాల్గొంటారు.