రాశిఫలాలు: 10 మే 2019 శుక్రవారం

రాశిఫలాలు: 10 మే 2019 శుక్రవారం

మేషం
గర్వానికి, అహంకారానికి తావివ్వకండి. అత్యుత్సాహానికి పోయి చేసే పనుల వల్ల ఇబ్బంది పడే అవకాశముంటుంది. పుకార్లను, చెప్పుడు మాటలను పట్టించుకోకండి. పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. మిత్రులతో కలిసి విహారయాత్రకు వెళతారు. 

వృషభం
ఉద్యోగ విషయంలో పదోన్నతికి సంబంధించిన ప్రయత్నం కొలిక్కి వస్తుంది. అత్యుత్సాహానికి పోకుండా, ఆలోచనతో పనులు పూర్తి చేయండి. ఈ రోజు కొత్త పనులు ప్రారంభించడానికి, వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

మిథునం
తొందరపడి పెట్టే పెట్టుబడుల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. అలాగే మీ శత్రువుల విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. రాజకీయ నాయకులు కానీ మీకు ఇబ్బంది కలిగించవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో, గృహ మరియు భూ సంబంధ లావాదేవీల్లో కొంత జాగ్రత్త అవసరం.

కర్కాటకం
చేపట్టిన ప్రయాణాలు మధ్యలో ఆపవలసి రావడం కానీ, ఏదైనా అడ్డంకి ఎదురవడం కానీ జరగవచ్చు. ఇతరులతో వ్యవహరించేప్పుడు కొంత జాగ్రత్త అవసరం. ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. 

సింహం
ఈ రోజు మీ పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ జీవితభాగస్వామి కోసం లేదా కుటుంబ సభ్యులకు డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు సామాన్యంగా ఉంటుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. 

కన్య
గృహ సంబంధ వ్యవహారాల్లో బిజీగా గడుపుతారు. మీ తల్లిగారి తరఫు బంధువులను కలుసుకోవడం జరుగుతుంది. మీ గృహానికి సంబంధించి కొనుగోలు వ్యవహారాలు లేదా ఇతర లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి.

తుల
ఈ రోజు మానసికంగా కొంత ఆందోళనగా ఉంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త. దూర ప్రయాణం, ఉద్యోగంలో మార్పు కానీ ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దైవ దర్శనం చేసుకోవడం కానీ, ఆధ్యాత్మిక క్షేత్రాల్ని సందర్శించడం చేస్తారు.

వృశ్చికం
ఇంటికి సంబంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహన కొనుగోలు లేదా భూ సంబంధ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. మానసిక ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి. ప్రశాంతతతో ఉంటేనే అన్ని పనులు చేయగలుగుతారు.

ధనుస్సు
ఉద్యోగంలో పదోన్నతి లేదా బదిలీ కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ రోజు ముఖ్యసమాచారం అందుతుంది. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ముఖ్యంగా మీ వృత్తిపరంగా మంచి గుర్తింపును పొందుతారు. 

మకరం
ఈ రోజు ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశముంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. అలాగే బంధువులతో మాట కారణంగా సమస్య వచ్చే అవకాశముంటుంది. దూర ప్రయాణాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలంగా ఉండదు.

కుంభం
ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా ఈ రోజు అనుకూలిస్తుంది. మొండి బకాయిలువసూలవుతాయి. 

మీనం
మీ సహోద్యోగుల కారణంగా కొంత అసూయకు, ఆవేశానికి లోనవుతారు. ఖర్చుల విషయంలో ఆచి, తూచి అడుగేయండి. గొప్పలకు పోయి డబ్బులు ఎక్కువగా ఖర్చు చేసుకోకండి. అలాగే ఇతరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త అవసరం.