రాశిఫలాలు: 12 మే 2019 ఆదివారం

రాశిఫలాలు: 12 మే 2019 ఆదివారం

మేషం
ఇవాళ పనుల విషయంలో చాలా అడ్డంకులు ఎదుర్కొంటారు. మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా ఎక్కువసార్లు ప్రయత్నిస్తే విజయం మీదే. ఆరోగ్యవిషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది. నరాలు, మెడకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశముంది.  జాగ్రత్త వహించడం మంచిది. 

వృషభం
ఇవాళ మీకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వృత్తిపరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్ కోసం ఎదురుచూస్తున్నవారికి ముఖ్యసమాచారం అందుతుంది. 

మిథునం
ఇవాళ ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేతులు, చెవులు మరియు తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశముంటుంది. చేపట్టిన ప్రయాణాలు మధ్యలో ఆపాల్సి రావటం కానీ, ఏదైనా అడ్డంకి ఎదురవటం కానీ జరుగవచ్చు.

కర్కాటకం
ఇవాళ మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. మీ పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. 

సింహం
ఇవాళ మీరు బద్ధకానికి, అసూయకు చోటివ్వకండి. మీ ప్రవర్తన కారణంగా సమస్యలు వచ్చే అవకాశముంటుంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. 

కన్య
ఇవాళ ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతారు. అవకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వినోద కార్యక్రమాల్లో మునిగితేలుతారు. 

తుల
ఇవాళ కొత్త పని ప్రారంభించడానికి చాలా అనుకూలమైన రోజు... మీరు ప్రారంభం చేసే పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు. ఆటంకాలు తొలగి పోతాయి, అనుకోని లాభాలు కానీ, మిత్రుల కలయిక కానీ జరుగుతుంది.

వృశ్చికం
ఇవాళ ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కొత్త వ్యక్తుల కారణంగా లేదా నూతన లావాదేవీల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. మీ శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచండి. జాగ్రత్త వహించడం మంచిది. 

ధనుస్సు
ఇవాళ ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. శ్వాస సంబంధ సమస్యలు కానీ, జీర్ణకోశ సంబంధ సమస్యలు కానీ వచ్చే అవకాశముంటుంది. అలాగే కీళ్లు, ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. 

మకరం
ఇవాళ మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. రోజంతా ఆనందంగా ఉంటారు. 

కుంభం
ఇవాళ ఆరోగ్యం బాగుంటుంది. వినోద కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వాహన సౌఖ్యం ఉంటుంది. చిరకాల మిత్రులు కలుస్తారు. మంచి ఆహారం స్వీకరిస్తారు. 

మీనం
ఇవాళ ఆరోగ్య విషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది. నరాలు, కడుపుకు సంబంధించిన సమస్యలు ఉండే అవకాశముంటుంది. మీ జీవితభాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది.