రాశిఫలాలు: 13 ఫిబ్రవరి 2019 బుధవారం

రాశిఫలాలు: 13 ఫిబ్రవరి 2019 బుధవారం

మేషం
అనుకోని ఖర్చుల కారణంగా కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశముంటుంది. అలాగే విలువైన వస్తువుల విషయంలో, నగల విషయంలో జాగ్రత్త అవసరం. అజాగ్రత్తగా ఉండకండి.

వృషభం
ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. మానసికంగా దృఢంగా ఉండటం మంచిది

మిథునం
మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి కానీ, అనుకున్న మార్పు కానీ చోటు చేసుకుంటుంది. పెట్టుబడులు పెట్టడానికి అనుకూల దినం.

కర్కాటకం
మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బు ఖర్చయ్యే అవకాశముంటుంది. అలసట, ఒత్తిడి అధికంగా ఉంటాయి. అలాగే పై అధికారులతో మీ సంబంధాలు మెరుగవుతాయి.

సింహం
పట్టిన పనులు, ప్రయాణాలు వాయిదా పడతాయి. అనవసర ఖర్చు పైన పడుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. పెట్టుబడులకు అనువైన రోజు కాదు. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం.

కన్య
స్నేహితులతో, జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. అలాగే వాహనం కొనుగోలు కానీ, భూ సంబంధ వ్యవహారాలు కానీ ఒక కొలిక్కి వస్తాయి. వినోదయాత్ర చేస్తారు.

తుల
ఇంటికి సంబంధించిన వస్తువులు కొనటం కానీ, వాహనం కొనుగోలు చేయటం కానీ చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అత్యుత్సాహానికి పొకండి. అలాగే ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చకండి.

వృశ్చికం
పెట్టుబడులకు, పోటీలకు అనువైన రోజు కాదు. మానసిక ప్రశాంతత కొరకు పిల్లలతో గడపటం కానీ, వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం మంచిది. మీరు ఎంతో ఇష్టంతో చేపట్టిన పని వాయిదా పడుతుంది. 

ధనుస్సు
ఆరోగ్యం విషయంలో ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. బయటి భోజనం చేయవద్దు. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. అలాగే మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉన్నది.

మకరం
మీ అజాగ్రత్త, అనాలోచిత ప్రవర్తన కారణంగా మీ బంధువులను అసహనానికి గురి చేసిన వారవుతారు. వారి నమ్మకాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడండి. తొందరపడి నిర్ణయం తీసుకోకండి .ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. 

కుంభం
ఇతరులతో మాట్లాడేప్పుడు కొంత జాగ్రత్త అవసరం. మీ మాటతీరు కారణంగా అనవసరపు వివాదాలు తలెత్తే అవకాశముంటుంది. అలాగే ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చకండి. మానసికంగా దృఢంగా ఉండటం మంచిది.

మీనం
మీ జీవిత భాగస్వామి నుంచి అనుకోని సాయం లభిస్తుంది. మీ మధ్య ఉన్న మనస్పర్దలు తొలగిపోతాయి. మీ ప్రేమ వ్యవహారాల్లో కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.