రాశిఫలాలు: 13 మే 2019 సోమవారం

రాశిఫలాలు: 13 మే 2019 సోమవారం

మేషం
ఇవాళ మీరు పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారికి సంబంధించిన పనులు పూర్తి చేయగలుగుతారు. అలాగే మీ ప్రేమను మీరు ప్రేమించినవ్యక్తికి చెప్పటానికి అనుకూలదినం. మానసికంగా ఉత్సాహంగా ఉన్నప్పటికీ, తెలియని చిన్న ఆందోళన మనసులో ఉంటుంది. 

వృషభం
ఇవాళ మీ ఇంటికి సంబంధించిన పనులు చేయటానికి, గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా అవసరం. 

మిథునం
ఇవాళ మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. బంధువులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అత్యుత్సాహానికి పోకుండా మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటే మీకే మంచిది. 

కర్కాటకం
ఇవాళ ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. పాతబాకీలు వసూలయినప్పటికీ, అందుకు తగిన ఖర్చుపైన పడటంతో వచ్చిన డబ్బు వచ్చినట్టే పోతుంది. పెట్టుబడులకు, వ్యాపార లావాదేవీలకు అనువైన రోజుకాదు. దూరపు బంధువుల కారణంగా కూడా అనుకోకుండా డబ్బు ఖర్చయ్యే అవకాశం ఉంది. 

సింహం
ఇవాళ మీకు అనుకూలంగా ఉంటుంది. రుచికరమైన ఆహారం లభిస్తుంది. మిత్రులు, బంధువులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయగలుగుతారు. 

కన్య
ఇవాళ కొంత బద్ధకంగా గడుపుతారు. ఏ పనిచేయటానికి ముందుకురారు. కుటుంబ సభ్యుల కోపానికి గురవుతారు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. మీ మిత్రులతో, దగ్గరి బంధువులతో వివాదం జరగటం లేదా వారుమిమ్మల్ని అపార్థం చేసుకోవటం జరుగవచ్చు. భూ సంబంధ వ్యవహారాలకు అనుకూల దినంకాదు. దూరంగా ఉండడం మంచిది. 

తుల
ఇవాళ మీకు అనుకూలంగా ఉంటుంది. మిత్రుల నుంచి అనుకోనిసాయం అందుకుంటారు. మీస్నేహం బలపడుతుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో అనుకోని శుభపరిణామాలు ఏర్పడతాయి.

వృశ్చికం
ఎప్పటి నుంచో వాయిదా పడుతోన్న పనులు పూర్తి చేయటానికి ఇవాళ అనుకూల సమయం. పైఅధికారులను కలవటానికి అలాగే ముఖ్యమైన ఒప్పందాలకు కూడా అనుకూలించే దినం. అనుకోని బహుమతులుకాని, ప్రశంసలు పొందుతారు. 

ధనుస్సు
ఇవాళ రోజువారీ పనుల నుంచి విశ్రాంతి కోరుకుంటారు. అలాగే ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువగా చూపుతారు. గురువులను లేదా ఆధ్యాత్మికవేత్తలను కలుస్తారు. ప్రయాణంలో అడ్డంకుల కారణంగా విసుగుకు లోనవుతారు. 

మకరం
ఇవాళ మానసికంగా కొంత ఆందోళనతో ఉంటారు. ఒకసంఘటన కారణంగా మీ మనసు చెదురుతుంది. ఆర్థికనష్టం, కోపం, అనారోగ్యం, కలహాలు, ఆందోళన మొదలైన భయం ఈ రోజు సూచించబడ్డాయి. మీ ఆవేశాన్ని, కోపాన్నిఅదుపులో ఉంచుకోవటం మంచిది. కొంత జాగ్రత్త అవసరం.  

కుంభం
ఇవాళ ఇతరులతో సంబంధ, బాంధవ్యాలు పెంచుకోవటానికి, ఒప్పందాలను, అంగీకారాలను కుదుర్చుకోవటానికి అనుకూల దినం. మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం చేస్తారు. మీ ప్రేమను, ఆప్యాయతను వ్యక్తం చేయటానికి అనువైన దినం. 

మీనం
ఇవాళ అపరిష్కృతంగా ఉన్న వివాదాలు, భూమి సంబంధ వివాదాలు పరిష్కరించుకోవటానికి అనుకూలదినం. మీమాట నెగ్గుతుంది. అనుకూల ఫలితం పొందుతారు. ఆర్థికలాభాలుంటాయి. జీవిత భాగస్వామి అనారోగ్యం కొంతఆందోళనకు కారణమవుతుంది.