రాశిఫలాలు: 13 ఏప్రిల్ 2019 శనివారం

రాశిఫలాలు: 13 ఏప్రిల్ 2019 శనివారం

ఇవాళ ఎప్పటి నుంచి వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. బంధువులను, స్నేహితులను కలుసుకుంటారు. ఇల్లు లేదా భూ సంబంధ లావాదేవీలు పూర్తి చేస్తారు. 

వృషభం
ఇవాళ వ్యాపార వ్యవహారాలకు, ముఖ్యమైన ఒప్పందాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణం చేసే అవకాశం ఉంది. అలాగే విదేశం నుంచి ఒక ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. కొత్త పరిచయాలు, స్నేహాలు ఏర్పడుతాయి.

మిథునం
ఇవాళ ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పనులు అనుకున్న విధంగా కాకపోయే సరికి కొంత నిరాశకు లోనవుతారు. ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం.

కర్కాటకం
ఇవాళ మీకు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. మంచి ఆహారం తీసుకోవడం కానీ, నూతన వస్త్రాలు కొనుగోలు చేయడం కానీ చేస్తారు. కొన్ని విషయాల్లో అత్యుత్సాహానికి పోకుండా ఉండడం మంచిది.

సింహం
ఇవాళ కొంత బద్ధకంగా ఉంటుంది. చిన్న పనికైనా ఇతరులపై ఆధారపడడం కానీ, ఇతరుల సాయం తీసుకోవడం కానీ చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో అనుకోని సమస్య కారణంగా ఆందోళనకు గురవుతారు. 

కన్య
ఇవాళ ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అనుకోని ఆదాయం ఉంటుంది. మీ స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. చాలా కాలం నుంచి ఎంత ప్రయత్నం చేసినా కాని పనులు ఇవాళ పూర్తవుతాయి.

తుల
ఇవాళ మీరు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో అనుకూల మార్పు ఉంటుంది. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. మీ పై అధికారులనుంచి అనుకోని బహుమతి అందుకుంటారు. 

వృశ్చికం
ఇవాళ మీరు రోజువారీ కార్యక్రమాల నుంచి విశ్రాంతిని కోరుకుంటారు. ఒకే రకమైన జీవన విధానంలో కొంత మార్పు సాధించాలన్న ఆలోచన కలిగి ఉంటారు. అనుకోని ప్రయాణం కానీ, మానసికంగా ఏదో తెలియని అలజడిని, వెలితిని కలిగి ఉంటారు. 

ధనుస్సు
ఇవాళ చేపట్టిన పనుల్లో అనుకోని అడ్డంకుల కారణంగా మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ఆవేశానికి లోనవకుండా స్థిమితంగా ఉండడం మంచిది. ఆర్థికస్థితి సామాన్యంగా ఉంటుంది. పెట్టుబడులకు, కొనుగోళ్లకు అనుకూలమైన రోజు కాదు. 

మకరం
ఇవాళ వివాహ సంబంధ వ్యవహారాలకు, ఒప్పందాలకు అనుకూల దినం. మీ మనసులోని భావాలను మీ జీవితభాగస్వామికి వ్యక్తం చేస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామితో విందు, వినోద కార్యక్రమాలకు వెళ్తారు. 

కుంభం
ఇవాళ ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. రావల్సిన పాత బకాయిలు రావడం కాని, లోన్ రావడం కానీ జరుగుతుంది. ఉద్యోగం విషయంలో ఎదురు చూస్తున్న వారికి కొంత అనుకూలత ఏర్పడుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. వ్యాపార విషయాలకు కొంత సామాన్యంగా ఉంటుంది. 

మీనం
ఇవాళ ప్రేమను లేదా మీ అభిప్రాయాన్ని వ్యక్త పరచడానికి అనుకూలంగా ఉంటుంది. మానసికంగా కొంత ఆందోళన, ఉత్సాహం కలగలుపుగా ఉంటాయి. మీ సంతానం ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం.