రాశిఫలాలు: 14 ఏప్రిల్ 2019 ఆదివారం

రాశిఫలాలు: 14 ఏప్రిల్ 2019 ఆదివారం

మేషం
ఇవాళ ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యులు లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. 

వృషభం
ఇవాళ మీ మనస్సు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవడం కానీ జరగవచ్చు. జాగ్రత్త వహించడం మంచిది. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి.

మిథునం
ఇవాళ ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ మాట తీరు కానీ, వ్యవహార శైలి కానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. వివాదాల్లో తలదూర్చకండి. 

కర్కాటకం
ఇవాళ మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఉద్యోగ విషయంలో సామాన్య దినం. ఎక్కువసేపు ఇంటిలో ఉండాలని, కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు. 

సింహం
ఇవాళ ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కానీ, ప్రయాణాలు కానీ చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. 

కన్య
ఇవాళ ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బు రావడం కానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందడం కానీ జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు.

తుల
ఇవాళ మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే విదేశీ యానం గురించి కానీ, ఉద్యోగంలో మార్పు గురించి కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్థి సంబంధ వ్యవహారాలకు, పై అధికారులను కలవటానికి అనుకూల దినం. 

వృశ్చికం
ఇవాళ మీరు దూర ప్రదేశం నుంచి వచ్చిన మిత్రులను కానీ, చిన్ననాటి మిత్రులను కానీ కలుసుకుంటారు. అలాగే విదేశీ యానానికి సంబంధించి ఒక ముఖ్య సమాచారాన్ని అందుకుంటారు. పని ఒత్తిడి కారణంగా అలసటకు గురవుతారు. అనుకోని ఖర్చులు అవుతాయి. ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం చేసుకుంటారు.

ధనుస్సు
ఇవాళ మీరు చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం. 

మకరం
ఇవాళ వ్యాపార లావాదేవీలు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ ఒక కొలిక్కి వస్తాయి. అలాగే వివాహ విషయంలో అనుకూలమైన ఫలితం వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు. ఆర్థిక స్థితి బాగుంటుంది.

కుంభం
ఇవాళ వృత్తి విషయంలో మార్పులు చోటు చేసుకుంటా యి. మీ సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశముంది. నరాలు, మెడకు సంబంధించిన అనారోగ్యంతో బాధపడే అవకాశముంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. 

మీనం
ఇవాళ మీ జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశముంటుంది. దాని కారణంగా మానసికంగా ఆందోళనకు లోనవుతారు. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. జాగ్రత్త వహించడం మంచిది.