రాశిఫలాలు: 15 ఫిబ్రవరి 2019 శుక్రవారం

రాశిఫలాలు: 15 ఫిబ్రవరి 2019 శుక్రవారం

మేషం
ఆవేశానికి లోనై తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. దాని కారణంగా తర్వాత బాధ పడాల్సి వస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. మీ జీవితభాగస్వామికి సం బంధించిన విషయంలో ఒక ముఖ్యమైన పని పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన చేసే అవకాశముంది. 

వృషభం
రావలసిన డబ్బులు తిరిగి రావటమే కాకుండా, పెట్టుబడుల నుంచి మంచి ధనాదాయం వస్తుంది. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మీ మాటకు విలువ పెరిగి, వివాదాలు సమసి పోతాయి. వృత్తిలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. 

మిథునం
మానసికంగా కొంత ఆందోళనకు గురవుతారు. ఏదో తెలియని భయాన్ని అనుభవిస్తారు. ఊహించని ఖర్చులు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కొత్త వారితో పరిచయం కానీ లేదా విదేశీ యానానికి సంబంధించి ముఖ్య సమాచారం కానీ అందుకుంటారు. 

కర్కాటకం
గొడవలు, అవమానానికి గురవటం లేదా వివాదాల్లో ఇరుక్కోవటం జరగవచ్చు. ఇతరుల వ్యవహారాల్లో కల్పించుకోకండి. మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా పనులు చేస్తే విజయం వరిస్తుంది. పెట్టుబడులకు అనుకూలం కాదు. ఖర్చులు అధికంగా ఉంటాయి.

సింహం
పెట్టుబడులకు అనుకూలమైన దినం. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అనుకూల ఫలితం పొందుతారు. ఉద్యోగ విషయంలో సామాన్యదినం. ఈ రోజు మీ మిత్రులను కలుసుకుంటారు. అలాగే ప్రయాణం లో అనుకోని లాభం కలుగుతుంది. 

కన్య
వ్యాపార సంబంధ లావాదేవీ, ఒప్పందాలు జరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కానీ, ఇతరుల ఒత్తిడికి లొంగి నిర్ణయాలు తీసుకోవటం కానీ మంచిది కాదు. ఉద్యోగ విషయంలో కానీ, ప్రయాణం విషయంలో కానీ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. 

తుల
ఆర్థిక సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకుని అవమానం పాలవకండి. మీ స్నేహితుల కారణంగా సమస్యకొంత తగ్గుతుంది. మీ పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవటం లేదా అనుకోని అడ్డంకులు రావటం వలన మానసికంగా చికాకుకు, కలతకు లోనవుతారు.

వృశ్చికం
ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.

ధనుస్సు
అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవటం కానీ జరగవచ్చు. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి.  మీ మనసు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. మీ బంధువులలో ఒకరి నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

మకరం
మీ మాటతీరు కానీ, వ్యవహార శైలికానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. వివాదాల్లో తలదూర్చకండి, దాని కారణంగా మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంది. ఇతరులతో వ్యవహరించేటప్ఫుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకోని మార్పులు చోటు చేసుకోవచ్చు.

కుంభం
మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగ విషయంలో సామాన్యదినం. ఎక్కువసేపు ఇంటిలో ఉండాలని, కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు. ఆర్థిక విషయాలు పెద్దగా అనుకూలించవు. మీ జీవితభాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశ మున్నది. 

మీనం
మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డబ్బుకానీ, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోకుండా చూసుకోండి. అలాగే ఇతరులతో వ్యవహరించేప్పుడు కూడా జాగ్రత్త అవసరం.  ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కానీ ప్రయాణాలు కాని చేయవలసి వస్తుంది.