రాశిఫలాలు: 17 ఏప్రిల్ 2019 బుధవారం

రాశిఫలాలు: 17 ఏప్రిల్ 2019 బుధవారం

మేషం
ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ విషయంలో లేదా పదోన్నతి విషయంలో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ పిల్లల ఆరోగ్యం మెరుగవుతుంది. పెట్టుబడులు లాభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు.

వృషభం
మానసికంగా కొంత ఆందోళనగా ఉంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణం కానీ, ఉద్యోగంలో మార్పు కానీ ఉంటుంది. ఆరోగ్యం విషయం, ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనుకూల దినం కాదు.

మిథునం
ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. వాహన కొనుగోలు లేదా భూ సంబంధ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇంటికి సంబంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. మానసిక ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి. ప్రశాంత చిత్తంతో ఉంటేనే అన్ని పనులు చేయగలుగుతారు.

కర్కాటకం
ఉద్యోగంలో బదిలి లేదా పదోన్నతి కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ రోజు ముఖ్య సమాచారం అందుతుంది. ముఖ్యంగా మీ వృత్తి పరంగా మంచి గుర్తింపును పొందుతారు. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.

సింహం
ఈరోజు ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశముంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. అలాగే బంధువులతో మాట కారణంగా సమస్య వచ్చే అవకాశముంటుంది. దూర ప్రయాణాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల దినం కాదు.

కన్య
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అనుకూల మార్పు చోటు చేసుకుంటుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి చెసే ప్రయత్నాలు ఫలిస్తాయి. 

తుల
మీ ప్రవర్తన కారణంగా సమస్యలు వచ్చే అవకాశముంటుంది. అలాగే మీరు తీసుకొనే నిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఏమరుపాటుగా తీసుకొనే నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశముంటుంది. బద్ధకానికి, అసూయకు చోటివ్వకండి. 

వృశ్చికం
ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతారు. అవకాశాలు అందివస్తాయి. వినోద కార్యక్రమాల్లో మునిగితేలుతారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు.

ధనుస్సు
అనుకోని సాయం కారణంగా చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో సమస్యలు తొలిగిపోతాయి. మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి, గతంలో ఆగిపోయిన పనులు పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంటుంది. 

మకరం
ఈరోజు పెట్టుబడులకు అనువైన రోజు కాదు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కొత్త వ్యక్తుల కారణంగా లేదా నూతన లావాదేవీల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. మీ శత్రువులమీద ఒక కన్నేసి ఉంచండి. వారి కారణంగా ఆర్థికంగా నష్టపోయే అవకాశముంటుంది. 

కుంభం
కొత్త పనులకు అనుకూలమైన రోజు కాదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. శ్వాస సంబంధ సమస్యలు కానీ, జీర్ణకోశ సంబంధ సమస్యలు కానీ వచ్చే అవకాశముంటుంది. అలాగే కీళ్లు, ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. 

మీనం
రోజంతా ఆనందంగా ఉంటారు. కొత్త పనులు చేపట్టడానికి అనుకూల సమయం. వ్యాపార వ్యవహారాలు కాని, ఇతర ఆర్థిక లావాదేవీలు కానీ అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. మానసికంగా, ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి.