18 జనవరి శుక్రవారం నాటి రాశిఫలాలు

18 జనవరి శుక్రవారం నాటి రాశిఫలాలు

మేషం
విదేశీ ప్రయాణంకు సంబంధించిన ఒక ముఖ్య సమాచారం తెలుస్తుంది. తలపెట్టిన పనులు పూర్తిచేయగలుగుతారు. చర్చలు సఫలం అవుతాయి.కొత్త స్నేహాలు పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన, ప్రయాణం కాని చేస్తారు.

వృషభం
పై అధికారులను కలువడానికి అలాగే ముఖ్యమైన ఒప్పందాలకు కూడా అనుకూలించే దినం. వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయడానికి అనుకూల సమయం. మీ మిత్రులు లేదా బంధువుల సహాయం అందుకుంటారు. అనుకోని వ్యక్తులను కలుసుకుంటారు.

మిథునం
ప్రయాణంలో అడ్డంకుల కారణంగా విసుగుకు లోనవుతారు. ఇంట్లోకి కొత్తవస్తువులు కొనటం జరుగుతుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువగా చూపుతారు. గురువులను లేదా ఆధ్యాత్మిక వేత్తలను కలుస్తారు.

కర్కాటకం
మీ ఆవేశాన్ని, కోపాన్ని అదుపులో ఉంచుకోవటం మంచిది. శివున్ని పూజించండి. ఈ రోజు మానసికంగా కొంత ఆందోళనతో ఉంటారు. ఒక సంఘటన కారణంగా మీ మనసు చెదురుతుంది. ఆర్థిక నష్టం, కోపం, అనారోగ్యం, కలహాలు, ఆందోళన మొదలైన భయం ఈ రోజు సూచించబడ్డాయి.

సింహం
మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం చేస్తారు. మీ ప్రేమను, ఆప్యాయతను వ్యక్తం చేయడానికి అనువైన దినం. పిల్లల ఆరోగ్య విషయంగా లేదా విద్యా విషయంగా కొంత ఆందోళన చెందుతారు. ఇతరులతో సంబంధ, బాంధవ్యాలు పెంచుకోవడానికి, ఒప్పందాలను, అంగీకారాలను కుదుర్చుకోవడానికి అనుకూల దినం.

కన్య
మీ మాట నెగ్గుతుంది. అనుకూల ఫలితం పొందుతారు. ఆర్థిక లాభాలుంటాయి. ఈ రోజు వివాదాలు, ముఖ్యంగా భూమి సంబంధ వివాదాలు పరిష్కరించుకోవడానికి అనుకూల దినం. గృహ, వాహన సంబంధ కొనుగోళ్లు చేస్తారు. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి.

తుల
 మానసికంగా ఉత్సాహంగా ఉన్నప్పటికీ, తెలియని చిన్న ఆందోళన మనసులో ఉంటుంది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం మంచిది. మీ పిల్లలతో ఆనందంగా గడుపుతారు. అలాగే మీ ప్రేమను మీరు ప్రేమించిన వ్యక్తికి చెప్పటానికి అనుకూల దినం.

వృశ్చికం
గృహసంబంధ వ్యవహారాలకు అనుకూల దినం. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. బంధువులను కలుసుకుంటారు. రావలసిన డబ్బు చేతికందుతుంది. ఈ రోజు ఇంట్లో ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడుతారు.

ధనుస్సు
భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మంచిది. అత్యుత్సాహం కారణంగా అనుకోని గొడవల్లో ఇరుక్కునే అవకాశముంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఈ రోజు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.

మకరం
పెట్టుబడులకు, వ్యాపార లావాదేవీలకు అనువైన రోజు కాదు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల కారణంగా కూడా డబ్బు ఖర్చయ్యే అవకాశముంటుంది. పాతబాకీలు వసూలైనప్పటికీ, అందుకు తగిన ఖర్చుపైన పడటంతో వచ్చిన డబ్బు వచ్చినట్టే పోతుంది.

కుంభం
అనుకున్న పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా అనుకూలిస్తుంది. అనుకోని ధనలాభం కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయసహకారాలు అందుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మిత్రులు, బంధువులతో కలిసి ఏదైనా శుభకార్యంలో పాల్గొంటారు.

మీనం
మీ మిత్రులతో కాని, దగ్గరి బంధువులతో కాని వివాదం జరుగడం లేదా వారు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం జరగవచ్చు. భూ సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు. ఈ రోజు కొంత బద్ధకంగా గడుపుతారు. ఏ పని చేయటానికి ముందుకురారు. దాని కారణంగా కుటుంబ సభ్యుల కోపానికి గురవుతారు.