రాశిఫలాలు: 18 ఏప్రిల్ 2019 గురువారం

రాశిఫలాలు: 18 ఏప్రిల్ 2019 గురువారం

మేషం
ఇవాళ చాలా కాలం నుంచి వాయిదా పడుతున్న పనులు చేయటానికి అనుకూలంగా ఉంటుంది. వాటిని విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. అలాగే ఉద్యోగంలో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది. 

వృషభం
ఇవాళ డబ్బు విషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది. అవసరానికి తగిన డబ్బు లభించకపోవడం కానీ, పెట్టుబడుల కారణంగా నష్టపోవడం కానీ జరుగవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త వహించడం అవసరం.

మిథునం
ఇవాళ ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యులు, బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. 

కర్కాటకం
ఇవాళ ఆర్థికంగా చాలా అనుకూలించే దినం. రావలసిన బకాయిలు రావడమే కాకుండా మీరు తీర్చవలసిన బాకీలు కూడా తీర్చగలుగుతారు. అనుకోని డబ్బు కానీ, చేపట్టిన పనిలో విజయం కానీ వరిస్తుంది. 

సింహం
ఇవాళ చేపట్టిన పనులు వాయిదా పడటం కానీ, అనుకోని అడ్డంకులు రావడం కానీ జరుగవచ్చు. ఇది కేవలం తాత్కాలికమే కాబట్టి పట్టువదలక ప్రయత్నించండి. 

కన్య
ఇవాళ దూర ప్రదేశం నుంచి ఒక శుభవార్త వింటారు. మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలందుకుంటారు. ప్రయాణం చేసే అవకాశముంటుంది. 

తుల
ఇవాళ ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. నేత్ర సంబంధమైన సమస్యలు కానీ, ఎలర్జీ బారిన కానీ పడే అవకాశముంటుంది. అలాగే మానసికంగా ఏదో తెలియని ఒత్తిడిని ఫీలవుతారు. 

వృశ్చికం
ఇవాళ మీకు ఆనందంగా, లాభదాయకంగా ఉంటుంది. అనుకోని మిత్రులను కలువడం, వారితో రోజును ఆనందంగా గడుపడం చేస్తారు. అలాగే మీ కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. 

ధనుస్సు
ఇవాళ వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. మీ కోరిక నెరవేరడం, లక్ష్యానికి చేరువవడం జరుగుతుంది. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగం విషయంలో విదేశీ యానానికి సంబంధించి శుభవార్త వింటారు.

మకరం
ఇవాళ ప్రయాణం చేసే అవకాశం అధికంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఉదర, ఛాతి సంబంధ అనారోగ్యాల వలన ఇబ్బందిపడే అవకాశముంటుంది. నిద్రలేమి కారణంగా రోజంతా ఏదో తెలియని అసౌకర్యంగా ఉంటుంది. 

కుంభం
ఇవాళ మీ సహోద్యోగులతో, పైఅధికారులతో కొంత సామరస్య పూర్వకంగా ప్రవర్తించడం మంచిది. అనుకోని ఆవేశం కారణంగా వారితో గొడవ జరిగే అవకాశముంటుంది.

మీనం
ఇవాళ మీ దాంపత్య జీవితంఆనందమయంగా ఉంటుంది. వివాదాలు సమసిపోతాయి. మీ జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాల్లో కానీ, శుభ కార్యక్రమంలో కానీ పాల్గొంటారు.