రాశిఫలాలు: 20 ఫిబ్రవరి 2019 బుధవారం

 రాశిఫలాలు: 20 ఫిబ్రవరి 2019 బుధవారం

మేషం
ఆర్థిక సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు. అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవటం, అడ్డంకులు ఎదురుకావడం వలన మానసికంగా చికాకుకు, కలతకు లోనవుతారు. మీ స్నేహితుల కారణంగా సమస్య కొంత తగ్గుతుంది. మీ పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. 

వృషభం
నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. ఏ పని అయినా అధిక శ్రమతో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. కడుపు లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యులు, బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది.

మిథునం 
ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువులలో ఒకరి నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు. మీ మనసు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవటం కానీ జరుగవచ్చు.

కర్కాటకం
వివాదాల్లో తలదూర్చకండి, దాని కారణంగా మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంటుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకోని మార్పులు చోటుచేసుకోవచ్చు. ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ మాటతీరు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. 

సింహం
ఉద్యోగం విషయంలో సామాన్య దినం. ఆర్థిక విషయాలు పెద్దగా అనుకూలించవు. మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. 

కన్య
మీ మాట కారణంగా ఇబ్బందులు వచ్చే అవకాశముంటుంది. మాట విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు పెరిగే అవకాశముంటుంది. మీ కుటుంబ సభ్యుల కొరకు లేదా విలువైన వస్తువులు కొనుగోలు చేయటం కొరకు ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.  

తుల
మీరు తలపెట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి. మీ పిల్లల గురించి శుభవార్త వింటారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.  అనుకోని విధంగా డబ్బురావటం కానీ, మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందటం కానీ జరుగుతుంది. 

వృశ్చికం
స్థిరాస్తి సంబంధ వ్యవహారాలకు, పై అధికారులను కలవటానికి అనుకూల దినం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే విదేశీయానం గురించి కానీ, ఉద్యోగంలో మార్పు గురించి కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి.

ధనుస్సు
పని ఒత్తిడి కారణంగా అలసటకు గురవుతారు. అనుకోని ఖర్చులు అవుతాయి. మీరు దూరప్రదేశం నుంచి వచ్చిన మిత్రులను కానీ, చిన్ననాటి మిత్రులను కానీ కలుసుకుంటారు. అలాగే విదేశీయానానికి సంబంధించి ఒక ముఖ్యసమాచారాన్ని అందుకుంటారు. ఆధ్యాత్మిక క్షేత్రదర్శనం చేసుకుంటారు.

మకరం
మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అపోహాలు, అపార్థాల కారణంగా బంధువులతో వివాదాలు ఏర్పడుతాయి. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. నూతన వ్యాపారానికి, ఆర్థిక లావాదేవీలకు అనుకూలదినం కాదు. మీరు చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడుతాయి.

కుంభం
మీ వ్యాపార భాగస్వామితో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త అవసరం. అనవసర అపోహాలకు తావివ్వకండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో అనుకూల ఫలితాలు ఏర్పడుతాయి. మీ వృత్తికి సంబంధించిన ఒప్పందాలు పూర్తి చేస్తారు.

మీనం
బ్యాంకు లేదా వ్యక్తుల నుంచి రావలసిన ఆర్థిక సహాయం అందుతుంది. మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆవేశానికి, అత్యుత్సాహానికి పోకుండా పనులు పూర్తి చేయండి. మీ పై అధికారులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త అవసరం. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.