రాశిఫలాలు: 20 జూన్ 2019 గురువారం

రాశిఫలాలు: 20 జూన్ 2019 గురువారం

మేషం
ఇవాళ మీరు వ్యాపారంలో తలపెట్టిన పనుల్లో మంచి విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నతి సాధిస్తారు. మీ ప్రతిభను చూపించాల్సిన సమయమిది. కొత్తవారితో పరిచయాలకు, స్నేహాలకు అనుకూలమైన రోజు. ఇతరుల ప్రభావానికి, ఒత్తిడికి లోనుకాకండి. 

వృషభం
ఇవాళ మీకు కొత్త వారితో పరిచయం కానీ లేదా విదేశీ యానానికి సంబంధించి ముఖ్య సమాచారం కానీ అందే సూచనలున్నాయి. మానసికంగా కొంత ఆందోళనకు గురవుతారు. ఏదో తెలియని భయాన్ని అనుభవిస్తారు. మీ తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. 

మిథునం
ఇవాళ మీరు ప్రతీ పనిలో, రోజువారి జీవితంలో ఏదో ఒక ఇబ్బందిని, అడ్డంకులను ఎదుర్కొంటారు. గొడవలు, అవమానానికి గురవడం లేదా వివాదాల్లో ఇరుక్కోవడం జరుగవచ్చు. ఇతరుల వ్యవహారాల్లో కల్పించుకోకపోవడం మంచిది.

కర్కాటకం
ఇవాళ మీ మిత్రులను కలుసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రయాణంలో అనుకోని లాభం కలుగుతుంది. బంధువులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. మంచి రుచికరమైన ఆహారం స్వీకరిస్తారు. ధన లాభం ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అనుకూల ఫలితం పొందుతారు.

సింహం
ఇవాళ ఉద్యోగం విషయంలో కానీ, ప్రయాణం విషయంలో కానీ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. వ్యాపార సంబంధ లావాదేవీ, ఒప్పందాలు జరుగుతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కానీ, ఇతరుల ఒత్తిడికి లొంగి నిర్ణయాలు తీసుకోవడం కానీ మంచిది కాదు.

కన్య
ఇవాళ మీరు అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవడం లేదా అనుకోని అడ్డంకులు రావడం వలన మానసికంగా చికాకుకు, కలతకు లోనవుతారు. మీ స్నేహితుల కారణంగా సమస్య కొంత తగ్గుతుంది. మీ పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. 

తుల
ఇవాళ మీ ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యులు, బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. 

వృశ్చికం
ఇవాళ మీ మనసు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవడం కానీ జరుగవచ్చు. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువులలో ఒకరి నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు. 

ధనుస్సు
ఇవాళ మీరు ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి... మీ మాట తీరు కానీ, వ్యవహార శైలి కానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. వివాదాల్లో తలదూర్చకండి, దాని కారణంగా మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంటుంది. 

మకరం
ఇవాళ మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఉద్యోగం విషయంలో సామాన్య దినం. ఎక్కువ సేపు ఇంటిలో ఉండాలని, కుటుంబ సభ్యులతో గడుపాలని కోరుకుంటారు.

కుంభం
ఇవాళ మీకు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కానీ ప్రయాణాలు కానీ చేయవలసి వస్తుంది. మానసికంగాఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డబ్బుకానీ, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకునే సూచనలున్నాయి.. జాగ్రత్తగా ఉండడం మంచిది. 

మీనం
ఇవాళ మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బు రావటం కానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందడం కానీ జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువుగాపూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోనిశుభపరిణామాలుంటాయి.