రాశిఫలాలు: 21 మార్చి 2019 గురువారం

రాశిఫలాలు: 21 మార్చి 2019 గురువారం

మేషం
మానసికంగా ఉత్సాహంగా ఉన్నప్పటికీ, తెలియని చిన్న ఆందోళన మనసులో ఉంటుంది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మంచిది. మీ పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారికి సంబంధించిన పనులు పూర్తి చేయగలుగుతారు. 

వృషభం
మానసికంగా కొంత ఆందోళన కానీ, పరాకుగా కాని ఉండడం జరుగుతుంది. చదువు పట్ల కొంత నిరాసక్తత ఉంటుంది. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. ఈ రోజు మీ ఇంటికి సంబంధించిన పనులు చేయడానికి, గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. 

మిథునం
ఈ రోజు చేపట్టిన పనులు విజయంవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. మానసికంగా కొంత ఆందోళన ఉన్నప్పటికీ, మీ స్నేహితులు లేదా బంధువుల కారణంగా అది తొలగిపోతుంది. చాలాకాలంగా వాయిదా పడుతున్న పనులు తిరిగి ప్రారంభమవుతాయి.

కర్కాటకం
పెట్టుబడులకు, వ్యాపార లావాదేవీలకు అనువైన రోజు కాదు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తారు. ఈ రోజు ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. పాతబాకీలు వసూలయినప్పటికీ, అందుకు తగిన ఖర్చుపైన పడడంతో వచ్చిన డబ్బు వచ్చినట్టే పోతుంది.

సింహం
ఈ రోజు మీకు ఆర్థికంగా అనుకూలిస్తుంది. అనుకోని ధనలాభం కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయసహకారాలు అందుకుంటారు. మిత్రులు, బంధువులతో కలిసి ఏదైనా శుభకార్యంలో పాల్గొంటారు. అనుకున్న పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయగలుగుతారు. 

కన్య
మీ మిత్రులతో కానీ, దగ్గరి బంధువులతో కాని వివాదం జరుగడం లేదా వారు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం జరగవచ్చు. ఈ రోజు కొంత బద్ధకంగా గడుపుతారు. ఏ పని చేయటానికి ముందుకురారు. దానికి కారణంగా కుటుంబ సభ్యుల కోపానికి గురవుతారు. 

తుల
ఈ రోజు ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ మిత్రులతో, బంధువులతో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. సంబంధాలు మెరుగవుతాయి. వృత్తిలో అనుకోని ప్రశంస కాని, గుర్తింపు కాని లభిస్తుంది. 

వృశ్చికం
ఈ రోజు వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయటానికి అనుకూల సమయం. పై అధికారులను కలవటానికి అలాగే ముఖ్యమైన ఒప్పందాలకు కూడా అనుకూలించే దినం. అనుకోని బహుమతులు కాని, ప్రశంసలు కాని పొందుతారు. మీ మిత్రులు లేదా బంధువుల సహాయం అందుకుంటారు. 

ధనుస్సు
ప్రయాణంలో అడ్డంకుల కారణంగా విసుగుకు లోనవుతారు. ఇంట్లోకి కొత్తవస్తువులు కొనడం కానీ, ఇల్లు సర్దడం కానీ చేస్తారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువగా చూపుతారు. గురువులను లేదా ఆధ్యాత్మిక వేత్తలను కలుస్తారు. 

మకరం
ఆర్థిక నష్టం, కోపం, అనారోగ్యం, కలహాలు, ఆందోళన మొదలైన భయం ఈ రోజు సూచించబడ్డాయి. మీ ఆవేశాన్ని, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. ఈ రోజు మానసికంగా కొంత ఆందోళనతో ఉంటారు. ఒక సంఘటన కారణంగా మీ మనసు చెదురుతుంది. శివున్ని పూజించడం మంచిది.

కుంభం
మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం చేస్తారు. మీ ప్రేమను, ఆప్యాయతను వ్యక్తం చేయటానికి అనువైన దినం. పిల్లల ఆరోగ్య విషయంగా లేదా విద్యా విషయంగా కొంత ఆందోళన చెందుతారు. ఇతరులతో సంబంధ, బాంధవ్యాలు పెంచుకోవటానికి, ఒప్పందాలను, అంగీకారాలను కుదుర్చుకోవటానికి అనుకూల దినం. 

మీనం
ఈరోజు అనుకూల ఫలితం పొందుతారు. ఆర్థిక లాభాలుంటాయి. జీవిత భాగస్వామి అనారోగ్యం కొంత ఆందోళనకు కారణమవుతుంది. గృహ, వాహన సంబంధ కొనుగోళ్లు చేస్తారు. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. వివాదాలు పరిష్కరించుకోవటానికి ఒప్పందాలు చేసుకోవటానికి అనుకూల దినం.