రాశిఫలాలు: 22 మార్చి 2019 శుక్రవారం

రాశిఫలాలు: 22 మార్చి 2019 శుక్రవారం

మేషం 
ఉద్యోగంలో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది. ప్రయాణాలకు సాధారణ దినం. ఈ రోజు చాలా కాలం నుంచి వాయిదా పడుతున్న పనులు చేయటానికి అనుకూలంగా ఉంటుంది. వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. 

వృషభం
ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనువైన దినం కాదు. అవసరానికి తగిన డబ్బు లభించక పోవటం కానీ, పెట్టుబడుల కారణంగా నష్టపోవటం కానీ జరుగవచ్చు. 

మిథునం
మీ కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. 

కర్కాటకం
రావలసిన బకాయిలు రావటమే కాకుండా మీరు తీర్చవలసిన బాకీలు కూడా తీర్చగలుగుతారు. అనుకోని డబ్బు కానీ, చేపట్టిన పనిలో విజయం కానీ వరిస్తుంది. ఉద్యోగ విషయంలో శుభవార్త వింటారు.

సింహం
పని ఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంటుంది. తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈ రోజు చేపట్టిన పనులు వాయిదా పడటం కానీ, అనుకోని అడ్డంకులు రావటం కానీ జరుగవచ్చు. పట్టువదలకుండా ప్రయత్నిస్తే విజయం సొంతమవుతుంది. 

కన్య
మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. మీ పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణం చేసే అవకాశముంటుంది. బంధువులను కలుసుకుంటారు. 

తుల
మానసికంగా ఏదో తెలియని ఒత్తిడికి గురవుతారు. ఆర్థిక విషయాలలో కూడా కొంత జాగ్రత్త అవసరం. డబ్బు ఎక్కువ దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయడం మంచిది కాదు. ఈ రోజు ఆరోగ్యం విషయంలో కొంచం శ్రద్ధ అవసరం. 

వృశ్చికం
ఈరోజు ఆర్థికంగా అనుకూలిస్తుంది. పెట్టుబడుల నుంచి అనుకోని లాభం వస్తుంది. అనుకోని మిత్రులను కలువటం, వారితో రోజును ఆనందంగా గడపటం చేస్తారు. అలాగే మీ కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. 

ధనుస్సు
మీ కోరిక నెరవేరటం, లక్ష్యానికి చేరువవటం జరుగుతుంది. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ విషయంలో విదేశీయానానికి సంబంధించి శుభవార్త వింటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

మకరం
నిద్రలేమి కారణంగా రోజంతా ఏదో తెలియని అసౌకర్యంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉదర, ఛాతి సంబంధ అనారోగ్యాల వలన ఇబ్బంది పడే అవకాశముంటుంది. మిత్రులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శనం చేసే అవకాశముంటుంది.

కుంభం
పెట్టుబడులకు, భూ, గృహ సంబంధ ఒప్పందాలకు అనువైన రోజు కాదు. ఈ రోజు మీ సహోద్యోగులతో, పై అధికారులతో కొంత సామరస్య పూర్వకంగా ప్రవర్తించటం మంచిది. అనుకోని ఆవేశం కారణంగా వారితో గొడవ జరిగే అవకాశముంటుంది. 

మీనం
విదేశీ ప్రయాణానికి లేదా ఉద్యోగానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. వ్యాపార లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు.