రాశిఫలాలు: 23 ఫిబ్రవరి 2019 శనివారం

రాశిఫలాలు: 23 ఫిబ్రవరి 2019 శనివారం

మేషం
ఉద్యోగంలో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది. ప్రయాణాలకు సాధారణ దినం. చాలా కాలం నుంచి వాయిదా పడుతున్న పనులు చేయటానికి అనుకూలంగా ఉంటుంది. వాటిని విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు.

వృషభం
ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనువైన దినం కాదు. డబ్బు విషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది. అవసరానికి తగిన డబ్బు లభించక పోవటం కానీ, పెట్టుబడుల కారణంగా నష్టపోవటం కానీ జరగవచ్చు. 

మిథునం
మీ కుటుంబ సభ్యుల లేదా ఆత్మీయుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు వాయిదా పడతాయి. సమయానుకూల ఆహారం తీసుకోని కారణంగా ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలతో బాధపడే అవకాశమున్నది.

కర్కాటకం
కుటుంబ సభ్యుల లేదా స్నేహితుల మధ్యన ఉన్న అపార్థాలు తొలగి పోతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు మీకు విజయాన్ని అందిస్తాయి. ఈ రోజు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు రావలసిన బకాయిలు రావటమే కాకుండా మీరు తీర్చవలసిన బాకీలు కూడా తీర్చగలుగుతారు. 

సింహం
పని ఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంటుంది. తగిన విశ్రాంతి తీసుకోవటం మంచిది. ఈ రోజు చేపట్టిన పనులు వాయిదా పడటం కానీ, అనుకోని అడ్డంకులు రావటం కానీ జరగవచ్చు. ఇది కేవలం తాత్కాలికమే కాబట్టి పట్టువదలక ప్రయత్నించండి. విజయం మీ స్వంతమవుతుంది. 

కన్య
ఈ రోజు దూర ప్రదేశం నుంచి ఒక శుభ వార్త వింటారు. మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణం చేసే అవకాశముంటుంది. బంధువులను కలుసుకుంటారు.

తుల
నేత్ర సంబంధ మైన సమస్యలు కానీ, ఎలర్జీ బారిన కానీ పడే అవకాశముంటుంది. అలాగే మానసికంగా ఏదో తెలియని ఒత్తిడిని ఫీల్ అవుతారు. ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. ఆర్థిక విషయాలలో కూడా కొంత జాగ్రత్త అవసరం. డబ్బు ఎక్కువ దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయకండి.

వృశ్చికం
అనుకోని మిత్రులను కలవటం, వారితో రోజును ఆనందంగా గడపటం చేస్తారు. అలాగే మీ కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. ఆర్థికంగా లాభిస్తుంది. పెట్టుబడుల నుంచి అనుకోని లాభం వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఈ రోజు మీకు ఆనందంగా, లాభ దాయకంగా ఉంటుంది. 

ధనుస్సు
వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ విషయంలో విదేశీయానానికి సంబంధించి శుభవార్త వింటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఈ రోజు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. మీ కోరిక నెరవేరటం, లక్ష్యానికి చేరువవటం జరుగుతుంది. 

మకరం
ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉదర, ఛాతి సంబంధ అనారోగ్యాల వలన ఇబ్బంది పడే అవకాశముంటుంది. నిద్రలేమి కారణంగా రోజంతా ఏదో తెలియని అసౌకర్యంగా ఉంటుంది. మిత్రులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం చేసే అవకాశముంటుంది.

కుంభం 
పెట్టుబడులకు, భూ, గృహ సంబంధ ఒప్పందాలకు అనువైన రోజు కాదు. ప్రయాణంలో అనవసర చిక్కుల్లో ఇరుక్కునే అవకాశముంది కాబట్టి జాగ్రత్త అవసరం. ఈ రోజు మీ సహోద్యోగులతో, పై అధికారులతో కొంత సామరస్య పూర్వకంగా ప్రవర్తించటం మంచిది. అనుకోని ఆవేశం కారణంగా వారితో గొడవ జరిగే అవకాశముంటుంది.

మీనం
వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టడం కానీ, నూతన వ్యాపార ఒప్పందాలు ఏర్పరచుకోవటం కానీ చేస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించటానికి అనుకూలంగా ఉంటుంది.
ఈ రోజు మీ దాంపత్యజీవితం ఆనందమయంగా ఉంటుంది. వివాదాలు సమసిపోతాయి. మీ జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాల్లో కానీ, శుభకార్యక్రమంలో కానీ పాల్గొంటారు.