నేటి.. మీ రాశిఫలాలు

నేటి.. మీ రాశిఫలాలు

మేషం
మీ స్నేహితుల కారణంగా సమస్య కొంత తగ్గుతుంది. మీ పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు. మీరు అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవటంతో మానసికంగా కలతకు లోనవుతారు. 

వృషభం
ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. అలాగే మీ కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.

మిథునం
అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవటం కానీ జరగవచ్చు. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువులలో ఒకరి నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

కర్కాటకం
మీ మాటతీరు కానీ, వ్యవహార శైలికానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. వివాదాల్లో తలదూర్చకండి, దాని కారణంగా మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంటుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. 

సింహం
ఉద్యోగ విషయంలో సామాన్యదినం. ఎక్కువసేపు ఇంటిలో ఉండాలని, కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు. ఆర్థిక విషయాలు పెద్దగా అనుకూలించవు. ఈ రోజు శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. 

కన్య
మీ కుటుంబ సభ్యుల కొరకు లేదా విలువైన వస్తువులు కొనుగోలు చేయటం కొరకు ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. మాట విషయంలో జాగ్రత్త అవసరం. మీ మాట కారణంగా ఇబ్బందులు వచ్చే అవకాశముంటుంది. ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు పెరిగే అవకాశముంటుంది. 

తుల
మీరు తలపెట్టిన పనులు సులువగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి. ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బురావటం కానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందటం కానీ జరుగుతుంది. 

వృశ్చికం
స్థిరాస్థి సంబంధ వ్యవహారాలకు, పై అధికారులను కలవటానికి అనుకూల దినం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఈ రోజు మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే విదేశీయానం గురించి కానీ, ఉద్యోగంలో మార్పు గురించి కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. 

ధనుస్సు
విదేశీయానానికి సంబంధించి ఒక ముఖ్యసమాచారాన్ని అందుకుంటారు. పని ఒత్తిడి కారణంగా అలసటకు గరవుతారు. అనుకోని ఖర్చులు అవుతాయి. ఈ రోజు మీరు దూరప్రదేశం నుంచి వచ్చిన మిత్రులను కానీ, చిన్ననాటి మిత్రులను కానీ కలుసుకుంటారు. ఆధ్యాత్మిక క్షేత్రదర్శనం చేసుకుంటారు. 

మకరం
మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అపోహలు, అపార్థాల కారణంగా బంధువులతో వివాదాలు ఏర్పడతాయి. నూతన వ్యాపారానికి, ఆర్థిక లావాదేవీలకు అనుకూలదినం కాదు. మీరు చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. 

కుంభం
మీ వ్యాపార భాగస్వామితో వ్యవహరించేప్పుడు జాగ్రత్త అవసరం. అనవసర అపోహలకు తావివ్వకండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. మీ వృత్తికి సంబంధించిన ఒప్పందాలు పూర్తి చేస్తారు.

మీనం
ఆవేశానికి, అత్యుత్సాహానికి పోకుండా పనులు పూర్తి చేయండి. మీ పై అధికారులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త అవసరం. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ రోజు మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. బ్యాంకు లేదా వ్యక్తుల నుంచి రావలసిన ఆర్థిక సహాయం అందుతుంది.