రాశిఫలాలు: 24 ఏప్రిల్ 2019 బుధవారం

రాశిఫలాలు: 24 ఏప్రిల్ 2019 బుధవారం

మేషం
ఈ రోజు మానసికంగా కొంత ఆందోళనకు గురవుతారు. ఏదోతెలియని భయాన్ని అనుభవిస్తారు. మీ తండ్రిగారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఊహించని ఖర్చులుంటాయి. కొత్తవారితో పరిచయం కానీ లేదా విదేశీయానానికి సంబంధించి ముఖ్య సమాచారం కానీ అందుకుంటారు. 

వృషభం
ఈ రోజు పెట్టుబడులకు అనుకూలం కాదు. ఖర్చులు అధికంగా ఉంటాయి. గొడవలు, అవమానానికి గురవడం లేదా వివాదాల్లో ఇరుక్కోవడం జరగవచ్చు. ఇతరుల వ్యవహారాల్లో కల్పించుకోకండి. మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా పనులు చేస్తే విజయం వరిస్తుంది. ప్రతి పనిలో, రోజువారి జీవితంలో ఏదో ఒక ఇబ్బందిని, అడ్డంకులను ఎదుర్కొంటారు.

మిథునం
ఈ రోజు ధనలాభం ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అనుకూల ఫలితం పొందుతారు. అలాగే ప్రయాణంలో అనుకోని లాభం కలుగుతుంది. బంధువులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. 

కర్కాటకం
వ్యాపార సంబంధ లావాదేవీ, ఒప్పందాలు జరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఇతరుల ఒత్తిడికి లొంగి నిర్ణయాలు తీసుకోవడం కానీ మంచిదికాదు. ఈ రోజు ఉద్యోగం , ప్రయాణం విషయంలో కానీ ఒకముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. 

సింహం
ఈ రోజు ఆర్థిక సంబంధ వ్యవహారాలకు అనుకూల దినంకాదు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుని అవమానం పాలవకండి. మీరు అనుకున్న పనులు సమయానికి పూర్తికాక పోవడం లేదా అనుకోని అడ్డంకులు రావడ వల్ల మానసికంగా చికాకుకు, కలతకు లోనవుతారు. 

కన్య
మీ కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదాఛాతి సంబంధ సమస్యలుండే అవకాశముంది.

తుల
అనాలోచిత నిర్ణయాలకారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడడం కానీ, వారికోపానికి గురవడం కానీ జరగవచ్చు. ఉద్యోగం, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువులలో ఒకరి నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు. ఈ రోజు మీ మనసు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. 

వృశ్చికం
ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వివాదాల్లో తలదూర్చకండి, దాని కారణంగా మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంటుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. మీ మాటతీరు కానీ, వ్యవహారశైలి కానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. 

ధనుస్సు
ఈ రోజు ఆర్థిక విషయాలు పెద్దగా అనుకూలించవు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగస్వామి మీకుఅనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఉద్యోగ విషయంలో సామాన్యదినం. ఎక్కువ సేపు ఇంటిలో ఉండాలని, కుటుంబ సభ్యులతోగడుపాలని కోరుకుంటారు. 

మకరం
మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డబ్బు కానీ, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోకుండా చూసుకోండి. అలాగే ఇతరులతో వ్యవహరించేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం. ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కాని ప్రయాణాలు కాని చేయవలసి వస్తుంది. 

కుంభం
మీరు తల పెట్టిన పనులు సులువుగాపూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోనిశుభ పరిణామాలుంటాయి. ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బురావడం కానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందడం కానీ జరుగుతుంది. 

మీనం
స్థిరాస్తి సంబంధ వ్యవహారాలకు, పై అధికారులను కలవడానికి అనుకూలదినం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఈ రోజు మీవ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఒక కొలిక్కివస్తాయి. అలాగే విదేశీయానం గురించి కానీ, ఉద్యోగంలో మార్పు గురించి కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి.