రాశిఫలాలు: 25 ఏప్రిల్ 2019 గురువారం

రాశిఫలాలు: 25 ఏప్రిల్ 2019 గురువారం

మేషం
అనవసర వివాదాలకుతావివ్వకండి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. ఉదర సంబంధ లేదా మూత్ర సంబంధ అనారోగ్యం కారణంగా బాధపడుతారు. మీ కుటుంబ సభ్యులతో కానీ, జీవితభాగస్వామితో కానీ వ్యవహరించేప్పుడు కొంత జాగ్రత్త అవసరం. 

వృషభం
ఈ రోజు అనుకోని వివాదాలు జరిగే అవకాశముంటుంది. కాబట్టి కోపానికి, ఆవేశానికి తావివ్వకండి. వివాదాలకు దూరంగా ఉండండి. మీపై అధికారులతోకానీ, సహోద్యోగులతోకానీ, స్నేహపూర్వకంగా మెలగటం మంచిది. శివారాధనమేలు చేస్తుంది.

మిథునం
మీప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో అనుకూల ఫలితాలుంటాయి. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. మీపిల్లలు మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు. ప్రయాణంకానీ, దేవాలయసందర్శన కానీ చేస్తారు. 

కర్కాటకం
ఉద్యోగంలో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది. ప్రయాణాలకు సాధారణ దినం. చాలా కాలంనుంచి వాయిదా పడుతున్న పనులుచేయటానికి అనుకూలంగా ఉంటుంది. వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.

సింహం
ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనువైన దినం కాదు. అవసరానికి తగిన డబ్బు లభించకపోవటంకానీ, పెట్టుబడుల కారణంగా నష్టపోవటం కానీ జరుగవచ్చు. 

కన్య
ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదాఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యులు లేదా బంధువుల ఆరోగ్యం కూడామీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.

తుల
ఈ రోజు ఆర్థికంగా చాలా అనుకూలించేదినం. రావలసిన బకాయిలు రావటమే కాకుండామీరు తీర్చవలసిన బాకీలు కూడా తీర్చగలుగుతారు. అనుకొని డబ్బుకానీ, చేపట్టిన పనిలో విజయం వరిస్తుంది. ఉద్యోగ విషయంలో శుభవార్త వింటారు.

వృశ్చికం
పనిఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంటుంది. ఈ రోజు చేపట్టిన పనులు వాయిదా పడటం కానీ, అనుకోనిఅడ్డంకులు రావటం కానీ జరుగవచ్చు. ఇదికేవలం తాత్కాలికమే కాబట్టి పట్టువదలక ప్రయత్నించండి. విజయం మీ స్వంతమవుతుంది.

ధనుస్సు
మీరు చేసినపనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పైఅధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణం చేసే అవకాశముంటుంది. బంధువులను కలుసుకుంటారు. ఈ రోజు దూర ప్రదేశం నుంచి ఒక శుభవార్త వింటారు. 

మకరం
ఈ రోజు ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. నేత్రసంబంధమైన సమస్యలుకానీ, ఎలర్జీ బారిన కానీ పడే అవకాశముంటుంది. అలాగే మానసికంగా ఏదో తెలియని ఒత్తిడిని ఫీల్ అవుతారు. ఆర్థిక విషయాలలో కూడా కొంత జాగ్రత్త అవసరం. 

కుంభం
ఈ రోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. పెట్టుబడుల నుంచి అనుకోని లాభం వస్తుంది. అనుకోని మిత్రులను కలవడం, వారితో రోజును ఆనందంగా గడపడం చేస్తారు. అలాగే మీ కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. 

మీనం
మీ కోరిక నెరవేరడం, లక్ష్యానికి చేరువవడం జరుగుతుంది. వాయిదాపడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగం విషయంలో విదేశీయానానికి సంబంధించి శుభవార్త వింటారు. మీప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.